Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs PBKS: కేఎల్ రాహుల్ విధ్వంసం.. చిత్తుగా ఓడిన చెన్నై

KL Rahul stars as Punjab beat Chennai by 6 wicket

దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశను పంజాబ్ కింగ్స్ విజయంతో ముగించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్(42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 98 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఒంటిచేత్తో విజయాన్నందించాడు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 134 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(55 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) మినహా అంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, క్రిస్ జోర్డాన్ రెండేసి వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్, షమీ చెరొక వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం స్వల్ప లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్.. కేఎల్ రాహుల్ విధ్వంసానికి 13 ఓవరల్లో 4 వికెట్లకు 134 పరుగులు చేసి 42 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో రన్‌రేట్‌ను మెరుగుపరుచుకున్న పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఆ జట్టు భవితవ్యం.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. 6 విజయాలు, 12 పాయింట్లతో ఉన్న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడితే రాహుల్ సేన టోర్నీలో ముందడుగు వేస్తుంది.

Story first published: Thursday, October 7, 2021, 19:06 [IST]
Other articles published on Oct 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+