
దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా ఔటైన తీరు చర్చనీయాంశమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆరంభంలోనే వరుస ఓవర్లలో ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్, ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ మొయిన్ అలీ వెనుదిరగడం.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు తీవ్రంగా గాయపడి మైదానం వీడటంతో క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా(6 బంతుల్లో 4) తీవ్రంగా నిరాశపరిచాడు.
బాధ్యతాయుతంగా ఆడాల్సిన టైమ్‌లో పేలవ షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్‌లో ఫోర్‌తో మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన రైనా ఆ వెంటనే తన షార్ట్‌బాల్ బలహీనతకు బలయ్యాడు. బౌల్ట్ వేసిన షార్ట్ పిచ్ బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన రైనా.. క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. బంతి అతని బ్యాట్ కింది భాగం చివరన తాకి గాల్లోకి లేవగా.. రాహుల్ చహర్ సులువుగా అందుకున్నాడు. అయితే బంతి వేగానికి తోడు చిట్ట చివరన తగలడంతో బ్యాట్ విరిగిపోయింది. దాంతో రైనా నిరాశగా వెనుదిరిగాడు. వికెట్ పారేసుకోవడమే కాకుండా బ్యాట్‌కూ విరగొట్టుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ముంబై బౌలర్ల ధాటికి 24 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన చెన్నై... కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్‌లో చెన్నై నిలబడటం కష్టమనిపిచింది. కానీ యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 88 నాటౌట్) ఆ అద్భుతాన్ని చేసి చూపించాడు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(26)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 81 పరుగులు జోడించడంతో చెన్నై గట్టెక్కింది.
ఇక ఈ ఇద్దరి క్లాస్ ఇన్నింగ్స్‌కు డ్వేన్ బ్రావో (8 బంతుల్లో 3 సిక్సర్లతో 23)మెరుపులు మెరిపించడంతో ముంబై ముందు చెన్నై 156 పరుగులు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది. ముందుగానే బ్యాటింగ్‌కు దిగిన ధోనీ(3) ఆకట్టుకోలేకపోయాడు. పేలవ బ్యాటింగ్‌తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. ఆరంభంలో దుమ్మురేపిన ముంబై బౌలర్లు చివర్లో బ్రావో, రుతురాజ్ థాటికి చేతులెత్తేశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై అప్పుడే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. డికాక్(17), అన్మోల్ ప్రీత్ సింగ్(16), సూర్యకుమార్ యాదవ్(3), ఇషాన్ కిషన్(11) తీవ్రంగా నిరాశపరిచారు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ కీరన్ పొలార్డ్‌తో పాటు సౌరభ్ తివారి ఉన్నాడు.