IPL 2022: వెళ్తూ వెళ్తూ చెన్నైని ఇంటికి తీసుకెళ్లిన ముంబై..!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పోరాటం ముగిసింది. కాస్తో కూస్తో ఉన్న ప్లే ఆఫ్స్ ఆశలను కూడా చెత్తాటతో ఆ జట్టు చేజార్చుకుంది. ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమై 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మరోవైపు అందరి కన్నా ముందే వరుస పరాజయాలతో లీగ్ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన ముంబై.. వెళ్తూ వెళ్తూ డిఫెండింగ్ చాంపియన్ అయిన చెన్నైని వెంట తీసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై ముంబై బౌలర్ల ధాటికి 97 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు.

ఆడుతూ పాడుతూ...
అనంతరం ముంబై ఇండియన్స్ 14.5 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసి ఘన విజయాన్నందుకుంది. తెలుగు తేజం తిలక్ వర్మ(32 బంతుల్లో 4 ఫోర్లతో 34 నాటౌట్) కడవరకు నిలిచి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. చెన్నౌ బౌలర్లలో ముఖేష్ చౌదరి మూడు వికెట్లు తీయగా.. సిమ్రన్ జిత్ సింగ్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యఛేదనలోనూ ముంబై ఇండియన్స్ తడబడింది.

33 పరుగులకే 4 వికెట్లు..
5 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ముఖేశ్ చౌదరి వేసిన మొదటి ఓవర్‌లోనే ఔట్ అయ్యాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ(18), సిమర్‌జీత్ సింగ్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.. వన్‌డౌన్‌లో వచ్చిన డానియల్ సామ్స్ 6 బంతులాడి 1 పరుగు మాత్రమే చేసి ముఖేశ్ చౌదరి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆరంగ్రేట మ్యాచ్ ఆడుతున్న త్రిస్టన్ స్టబ్స్ కూడా డకౌట్ కావడంతో 33 పరుగులకే ముంబై 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

గెలిపించిన తిలక్ వర్మ
ముఖేశ్ చౌదరి 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా సిమర్‌జీత్ సింగ్ 22 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. ఈ ఇద్దరి కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా 8 ఓవర్లు ముగిసే సరికి 46 పరుగులు మాత్రమే చేయగలిగింది ముంబై... ఆ తర్వాత తిలక్ వర్మ, హృతిక్ షోకీన్ కలిసి ఐదో వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 23 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన హృతిక్ షోకీన్, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు... తిలక్ వర్మ 32 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేయగా, టిమ్ డేవిడ్ 7 బంతుల్లో 2 సిక్సర్లతో 16 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications