Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs MI: ఆఖరి ఓవర్‌లో ధోనీ విధ్వంసం... ముంబై ముందు భారీ లక్ష్యం!

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు దుమ్మురేపారు. రుతురాజ్ గైక్వాడ్(40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69), శివమ్ దూబే(38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో ఆ జట్టు 207 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

చివరి ఓవర్‌లో ధోనీ(4 బంతుల్లో 3 సిక్స్‌లతో 20 నాటౌట్) భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయిట్జీ, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీసారు.

CSK vs MI MS Dhoni finishes with three sixes in last over as CSK post 206 4

శుభారంభం లేకున్నా..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అజింక్యా రహానే(5) తీవ్రంగా నిరాశపరిచాడు. గెరాల్డ్ కోయిట్జీ వేసిన రెండో ఓవర్‌లోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

క్రీజులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్.. మరో ఓపెనర్ రచిన్ రవీంద్రతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. దాంతో సీఎస్‌కే పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 48 పరుగులు మాత్రమే చేసింది. శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర(21) కీపర్ క్యాచ్‌గా వెనుదిరగడంతో రెండో వికెట్‌కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

శివాలెత్తిన శివమ్ దూబే, రుతురాజ్
బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్ దూబేతో కలిసి రుతురాజ్ గైక్వాడ్ చెలరేగాడు. ఈ క్రమంలో అతను 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అనంతరం మరింత ధాటిగా ఆడాడు. మరోవైపు శివమ్ దూబే సైతం భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అతను 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడిన రుతురాజ్ గైక్వాడ్‌ను హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

దాంతో మూడో వికెట్‌కు జోడించిన 90 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్‌(17)ను కూడా పాండ్యానే ఔట్ చేయగా.. ఆఖరి ఓవర్‌లో బ్యాటింగ్ వచ్చిన ధోనీ హ్యాట్రిక్ సిక్స్‌లతో సీఎస్‌కే స్కోర్‌ను 200 పరుగుల మార్క్ ధాటించాడు.

Story first published: Sunday, April 14, 2024, 21:33 [IST]
Other articles published on Apr 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+