టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్ 2025 సీజన్‌ను చెత్త రికార్డ్‌తో ప్రారంభించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌటై తీవ్రంగా నిరాశపరిచాడు. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ.. క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్‌స్వింగర్‌ను మిడ్ వికెట్ దిశగా రోహిత్ ఫ్లిక్ షాట్ ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శివమ్ దూబే అందుకున్నాడు. దాంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ వైఫల్యంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా.. దినేశ్ కార్తీక్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ రికార్డ్‌లను రోహిత్ సమం చేశాడు. ఇప్పటి వరకు రోహిత్ 18 సార్లు డకౌటయ్యాడు.

ఈ జాబితాలో రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ 18 డకౌట్స్‌తో టాప్‌లో ఉండగా.. సునీల్ నరైన్, పియూష్ చావ్లా 16 డకౌట్లతో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. 18 సీజన్లలో 18 సార్లు డకౌటై రోహిత్ లెక్క సమం చేశాడని, మరోసారి డకౌట్ అవ్వడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
రోహిత్ శర్మ వైఫల్యం ముంబై ఇండియన్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29), తిలక్ వర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31)టాప్ స్కోరర్లుగా నిలవగా.. చివర్లో దీపక్ చాహర్(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్(4/14) నాలుగు వికెట్లతో ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించాడు. ఖలీల్ అహ్మద్(3/29) మూడు వికెట్లు తీయగా.. నాథన్ ఎల్లిస్, రవిచంద్రన్ అశ్విన్‌కు చెరో వికెట్ దక్కింది. తిలక్ వర్మతో కలిసి ఆచితూచి ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్‌ను ధోనీ కళ్లు చెదిరే స్టంపింగ్‌తో పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. రెప్పపాటు సమయంలోనే ధోనీ ఈ స్టంపౌట్ చేయడం విశేషం. ధోనీ స్టంపింగ్‌కు సూర్య బిత్తరపోయాడు.