For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs MI Dream11 Prediction: కెప్టెన్‌గా సూర్య.. వైస్ కెప్టెన్‌‌గా మొయిన్ అలీ! ఫాంటసీ టీమ్, టిప్స్ ఇవే!

CSK vs MI Dream11 Prediction Match 30: Captain, Vice-Captain, Fantasy Tips And Playing 11

హైదరాబాద్: అరబ్​ గడ్డపై అదిరిపోయే క్రికెట్​ హంగామా.. గ్రాండ్​ గాలా నైట్స్​లో.. హీటెక్కించే వేడిలో.. మోతెక్కనున్న పరుగుల ఆట.. మరో 24 గంటల్లో ప్రారంభం కానుంది. కరోనాతో ఇన్నాళ్లు దూరమైన ఫ్యాన్స్​ సందడి.. చీర్​ గాళ్స్​​ వంపు సొంపుల వయ్యారాలతో.. కావాల్సినంత వినోదాన్ని పంచేందుకు ఇండియన్స్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ సెకండాఫ్ మనముందుకు వచ్చేస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, త్రీటైమ్ టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే తొలి పోరుతో ఈ ధనాధన్ లీగ్ షురూ కానుంది. కరోనా కారణంగా భారత్ వేదికగా ప్రారంభమైన ఫస్టాఫ్ అర్దంతరంగా ఆగిపోవడంతో రెండో దశ మ్యాచ్‌లను యూఏఈకి తరలించిన విషయం తెలిసిందే.

మళ్లీ హోరా హోరీ తప్పదు..

మళ్లీ హోరా హోరీ తప్పదు..

చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ రెండు బలమైన జట్లు కావడంతో ఈ మలిదశ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ చివరకు కీరన్ పొలార్డ్ విధ్వంసంతో ముంబై వశమైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 219 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించగా.. కీరన్ పొలార్డ్(34 బంతుల్లో 87 నాటౌట్) విధ్వంసంతో రోహిత్ సేన సునాయసంగా చేధించి నాలుగు వికెట్లతో గెలుపొందింది. అయితే ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోంది. ఇప్పటికే 5 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతున్న ధోనీ సేన సెకండాఫ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనుకుంటుంది. మరోవైపు నాలుగో స్థానంలో ఉన్న ముంబై ప్లేఆఫ్స్‌ చేరాలంటే ఆచితూచి ఆడాల్సిన పరిస్థితి. సెకండాఫ్‌లో మిగిలిన జట్లు గట్టి పోటీ ఇచ్చే వీలుండటంతో ముంబై ఆరంభ మ్యాచ్‌లు కచ్చితంగా గెలవాలి. దాంతో తొలి మ్యాచ్‌లోనే మరోసారి చెన్నైను ఓడించాలనే పట్టుదలతో రోహిత్ సేన బరిలోకి దిగుతోంది.

ఫాప్ డౌట్.. కరన్ ఔట్..

ఫాప్ డౌట్.. కరన్ ఔట్..

అయితే ఈ మెగా మ్యాచ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోనుంది. ఆలస్యంగా యూఏఈకి వచ్చిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ ఈ మ్యాచ్‌కు దూరమవ్వగా.. గజ్జ గాయంతో బాధపడుతున్న డుప్లెసిస్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. బుధవారమే ఇంగ్లండ్ నుంచి యూఏఈకి చేరుకున్న సామ్ కరన్ ప్రస్తుతం 6 రోజుల క్వారంటైన్ పాటిస్తున్నాడు. అతని క్వారంటైన్ సెప్టెంబర్ 21న ముగియనుంది. దాంతో అతను ముంబైతో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)2021లో గజ్జ గాయానికి గురైన డుప్లెసిస్ కూడా ఫస్ట్ మ్యాచ్ ఆడటం డౌటే. ఈ గాయంతోనే అతను సీపీఎల్‌లో కీలక సెమీస్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ ఆడలేదు. గజ్జ గాయానికి సుదీర్ఘ విశ్రాంతి అవసరం కాబట్టి అతను మరికొన్ని మ్యాచ్‌లు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇక డుప్లెసిస్ స్థానంలో రాబిన్ ఊతప్ప, సామ్ కరన్ ప్లేస్‌లో హజెల్ వుడ్ జట్టులోకి రానున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు(అంచనా)

రాబిన్ ఊతప్ప/ఫాఫ్ డూ ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేశ్ రైనా, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి, జోష్ హజెల్ వుడ్

పటిష్టంగా ముంబై..

పటిష్టంగా ముంబై..

కరోనా పుణ్యమా వచ్చిన ఈ సుదీర్ఘ విరామంలో దాదాపు అన్ని జట్లలో మార్పులు చోటు చేసుకోగా.. ముంబై ఇండియన్స్‌లో మాత్రం ఒక్కటంటే ఒక్క మార్పు జరగలేదు. ఏ ఆటగాడు జట్టుకు దూరమవ్వలేదు. రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌, సూర్యకుమార్ యాదవ్‌లతో ముంబై పటిష్టంగా ఉంది. సౌతాఫ్రికా-శ్రీలంక టీ20 సిరీస్ నేపథ్యంలో క్వింటన్ డికాక్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమవుతాడని భావించినా.. బీసీసీఐ సడలింపులతో అతను అందుబాటులోకి వచ్చాడు. పైగా అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో ముంబై సమతూకంగా ఉంది. ఫస్టాఫ్‌లో కాస్త ఇబ్బంది పడిన ముంబై స్టార్ ఆటగాళ్లు యూఏఈ గడ్డపై ఎలా చెలరేగుతారో చూడాలి.

ముంబై తుది జట్టు: (అంచనా)

క్వింటన్ డికాక్ (కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మార్కో జాన్‌సెన్

డ్రీమ్ 11 ఫాంటసీ టిప్స్..

డ్రీమ్ 11 ఫాంటసీ టిప్స్..

బ్యాట్స్‌మన్ విభాగంలో రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్‌లను ఎంచుకోవడం ఉత్తమం. ఫస్టాఫ్ సీజన్‌లో ఈ ఇద్దరు దుమ్మురేపారు. పైగా సూర్య ఇటీవల కాలంలో నిలకడగా రాణిస్తున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో మోయిన్ అలీ, కృనాల్ పాండ్యాలు మంచి చాయిస్. మిగతా ఆల్‌రౌండర్లతో పోలిస్తే ఫస్టాఫ్ సీజన్‌లో ఈ ఇద్దరే మెరుగ్గా రాణించారు. యూఏఈ పిచ్‌లపై స్పిన్నర్లు కీలకం కాబట్టి.. వీరిని ఎంచుకోవడమే ఉత్తమం. బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రాలను ఎంచుకోవడం మంచిది. ఈ ఇద్దరు మంచి ఫామ్‌లో ఉన్నారు. శార్దూల్‌కు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటంతో పాటు అతని స్లో బౌలింగ్ యూఏఈ పిచ్‌లకు సరిపోనుంది. టీ20ల్లో బుమ్రా సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వికెట్ కీపర్‌గా క్వింటన్ డికాక్‌ను తీసుకోవడమే ఉత్తమం. ముంబై ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ కాబట్టి అతనే సరైన ఎంపిక. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ధోనీని డ్రీమ్ 11 టీమ్‌లోకి తీసుకోకపోవడమే మంచిది. చివర్లో బ్యాటింగ్ వచ్చే ధోనీ రాణిస్తాడో లేదో తెలియాదు. కేవలం అతని కీపింగ్ సామర్థ్యాన్ని నమ్ముకోవడం వృథా ప్రయాస. కెప్టెన్‌గా సూర్య, వైస్ కెప్టెన్ మోయిన్ అలీని తీసుకోవడం ఉత్తమం. లేదంటే డికాక్, రోహిత్‌లను కూడా కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా ఎంచుకోవచ్చు.

మైఖేల్ డ్రీమ్ 11 టీమ్ 1

మైఖేల్ డ్రీమ్ 11 టీమ్ 1

క్వింటన్ డికాక్, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ(వైస్ కెప్టెన్), కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, రాహుల్ చాహర్

మైఖేల్ డ్రీమ్ 11 టీమ్ 2

క్వింటన్ డికాక్(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), అంబటి రాయుడు, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, సామ్ కరన్, మొయిన్ అలీ, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, ఇమ్రాన్ తాహిర్

Story first published: Saturday, September 18, 2021, 18:24 [IST]
Other articles published on Sep 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+