Aakash Chopra's CSK vs MI Playing XI: కరన్‌కు షాక్.. హేజిల్‌వుడ్‌కు చోటు! మిల్నేకే చోప్రా ఓటు! తుది జట్లు ఇవే!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఎడిషన్ రెండవ దశ మరికొద్ది గంటల్లో ఆరంభం కానుంది. దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరు ఆసక్తి రేపుతోంది. హోరాహోరీగా సాగే ఈ మ్యాచ్‌తో రెండో దశ సీజన్‌కు గొప్ప ఆరంభం ఖాయం. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అందరూ ఫామ్‌లో ఉండడంతో ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తమ తుది జట్లను ప్రకటించాడు. ముంబై తమ ఫేవరేట్ అని పేర్కొన్నాడు.

ఠాకూర్‌ను కచ్చితంగా తీసుకోవాలి
ఆదివారం ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ... ' చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బలంగానే ఉంది. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్ ఆడతారు. ఆపై మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ చేస్తారు. అయితే మిస్టర్ ఐపీఎల్ రైనా ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధ శతకమే సాధించిన నేపథ్యంలో ఇప్పుడు చెలరేగిపోవాలి.
ఇక డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా రూపంలో మంచి ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. చెన్నై శార్దూల్ ఠాకూర్‌ను కచ్చితంగా ఆడించాలి. 9వ స్థానం వరకు చెన్నై బ్యాటింగ్ చేయగలడు. సామ్ కరన్ ఉండి ఉంటే ఇంకా బాగుండేది. బౌలింగ్ విభాగం దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, జోష్ హేజిల్‌వుడ్‌తో బలంగా ఉంది' అని అన్నాడు.

నెమ్మదిగా ఆరంభించడం మినహాయిస్తే
'ముంబై ఇండియన్స్ జట్టుకుండే ప్రధాన సమస్య చెన్నై పిచ్. ఇప్పుడా ఇబ్బంది లేదు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బాగా ఆడుతున్నాడు. మిగతా ఆటగాళ్లు రాణిస్తే బాగుంటుంది. నెమ్మదిగా ఆరంభించడం మినహాయిస్తే ఆ జట్టుకు ఎలాంటి సమస్య లేదనే చెప్పాలి. తొలి బంతి నుంచే దంచికొట్టాలి. ఓపెనర్లుగా రోహిత్, క్వింటన్ డికాక్ బరిలోకి దిగుతారు.
తర్వాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్ ఉన్నారు. వారందరూ పరుగులు చేశారు. ఇషాన్, సూర్యకుమార్, హార్దిక్, పోలార్డ్ ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేయగలరు. వీళ్లంతా రాణిస్తే ముంబై మంచి స్కోర్ చేయగలదు' అని ఆకాశ్ చోప్రా చెప్పాడు.
IPL 2021లో ప్రేక్షకులు.. ఆ మైదానంలో కఠిన రూల్స్! వారికి అనుమతి లేదు!!

చహర్‌ను ఆడించాలి
'ఇక ముంబై బౌలింగ్ విషయానికి వస్తే.. స్పిన్నర్ రాహుల్ చహర్‌ను కచ్చితంగా ఆడిస్తుంది. ఆ తర్వాత ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరగాలి. ఇందులో ఆడం మిల్నే లేదా నాథన్ కౌల్టర్ నైల్.. ఇద్దరిలో ఒకర్ని తీసుకోవాలి. ఆడం అదనపు పేస్ వేయగలడు కాబట్టి అతడే తుది జట్టులో ఉంటే బాగుంటుంది. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఎలాగూ ఉన్నారు. చెన్నైతో తలపడేందుకు ఈ జట్టు సరిగ్గా సరిపోతుంది. మరోవైపు ముంబై ఆటగాళ్లకు ఎలాంటి గాయాల బెడద కూడా లేదు. స్వేచ్ఛగా ఆడితే విజయం వారిదే' అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పుకొచ్చాడు.

ఆకాశ్ చోప్రా తుది జట్లు ఇవే:
చెన్నై: ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మోయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ(కెప్టెన్ మరియు వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, జోష్ హాజెల్‌వుడ్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చహర్.
ముంబై: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కిరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చహర్, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications