ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. డ్యూ వచ్చే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డ్యూ రావడం గమనించాం. మ్యాచ్‌పై డ్యూ తీవ్ర ప్రభావం చూపించనుంది. పిచ్ కూడా స్లోగా ఉండే అవకాశం ఉంది. పిచ్‌కు తగ్గట్లు బౌలింగ్ చేసి బ్యాటర్లపై ఒత్తిడి తేవాలనుకుంటున్నాం.

మూడు విభాగాల్లో మేం అద్భుతంగా రాణిస్తున్నాం. అయితే గత మ్యాచ్ ఫలితం ఇక్కడ అనవసరం. చెన్నైలో ఎలాంటి సవాళ్లు ఉంటాయో నాకు బాగా తెలుసు. ఇక్కడ ప్రతీ అభిమాని వారికే మద్దతు తెలుపుతాడు. మా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రేక్షకులను మౌనంగా ఉంచాలనే ఉద్దేశం మాకు లేదు. మంచి క్రికెట్ ఆడి వారిని ఎంటర్‌టైన్ చేస్తాం.'అని రాహుల్ తెలిపాడు.
తాను టాస్ ఓడిపోవడం పునరావృతమైందని సీఎస్‌కే సారథి రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. టాస్ గెలిచే విషయంలో తాను కాయిన్‌తో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో తాను టాస్ ఓడానని తెలిపాడు. 'ఈ మ్యాచ్‌లో డ్యూ వచ్చే అవకాశం ఉంది. అయితే వికెట్ ఎలా సర్‌ప్రైజ్ చేయనుందో చెప్పలేం.
పరిస్థితులతో సంబంధం లేకుండా పోయి ఆడటమే ఆటగాళ్ల బాధ్యత. బంతి స్లాట్‌లో ఉంటే బాదాల్సిందే. తుది జట్టులో ఒక మార్పు చేశాం. రచిన్ రవీంద్ర స్థానంలో డారిల్ మిచెల్‌ను తీసుకున్నాం. హోమ్‌గ్రౌండ్‌లో మూడు మ్యాచ్‌లు గెలవడం సంతోషంగా ఉంది. టాస్ గెలిచినా ఓడినా ఒకటే. గుడ్ క్రికెట్ ఆడితే ఫలితం మనకు అనుకూలంగా ఉంటుంది.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్, డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీష పతీరణ
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్(కీపర్), మార్కస్ స్టోయినీస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, మ్యాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మోహ్‌సిన్ ఖాన్, యశ్ ఠాకూర్