Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెపాక్‌‌లో మ్యాచ్.. స్పెషల్ ఫీలింగ్: ధోనీ

చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని లక్నో సారథి కేఎల్ రాహుల్ తెలిపాడు. అంతేకాకుండా చేజింగ్‌లో తమ సత్తా ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. 'ఢిల్లీ క్యాపిటల్స్‌తో గత మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాం. ఈ రోజు కూడా అదే జోరును కొనసాగించాలనుకుంటున్నాం. టీమ్ కాంబినేషన్‌లో భాగంగా జయదేవ్ ఉనాద్కత్‌ స్థానంలో యశ్ ఠాకూర్‌ను ఆడిస్తున్నాం'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

చాలా ఏళ్ల తర్వాత చెపాక్ స్టేడియం ఆడుతుండటం చాలా సంతోషంగా ఉందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. 2008లోనే ఐపీఎల్ ప్రారంభమైనా.. చెపాక్ మైదానంలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదన్నాడు. కేవలం 5-6 సీజన్లు మాత్రమే ఇక్కడ ఆడామని, ఇన్నాళ్లకు పూర్తి స్థాయి స్టేడియం అందుబాటులోకి వచ్చిందని చెప్పాడు. 'గతంలో కొన్ని స్టాండ్స్ ఖాళీగా ఉండేవి. మా హోమ్ గ్రౌండ్ చెపాక్ మైదానంలో మ్యాచ్‌లు ఆడుతుండటం సంతోషంగా ఫీలవుతున్నాం. ఎలాంటి మార్పులు లేకుండా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాం. పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని భారీ లక్ష్యాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉంది.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.

CSK vs LSG: KL Rahul wins toss, Lucknow to bowl first as Chennai and MS Dhoni return to Chepauk

గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్.. సొంతగడ్డపై లక్నోను ఓడించి టోర్నీలో బోణీ కొట్టాలనుకుంటోంది. మరోవైపు ఢిల్లీని ఓడించి జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్ ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది.

తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ(కీపర్), శివమ్ దూబే, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, హంగార్గేకర్

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినీస్, నికోలస్ పూరన్(కీపర్), కృష్ణప్ప గౌతమ్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్

Story first published: Monday, April 3, 2023, 19:31 [IST]
Other articles published on Apr 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+