Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs LSG: మైదానంలోకి గ్రామ సింహం.. పరుగులు తీసిన సెక్యూరిటీ!

చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే చెన్నై ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు మైదానంలోకి ఊహించని అతిథి వచ్చింది.

దాంతో ఆట ప్రారంభానికి ఆలస్యం కాగా..సెక్యూరిటీ సిబ్బంది పరుగులు పెట్టారు. ఇంతకీ ఆ అతిథి ఎవరంటే గ్రామ సింహం. సెక్యూరిటీ కళ్లు గప్పిన ఓ శునకం.. మైదానంలోకి దూసుకొచ్చింది. దాంతో ఆట ఆసల్యంగా ప్రారంభమైంది. ఆ శునకాన్ని బయటకు వెళ్లగొట్టేందుకు సెక్యూరిటీ సిబ్బంది నానా కష్టాలు పడ్డారు. చివరకు దాన్ని రౌండప్ చేసి బయటకు వెళ్లగొట్టారు. అయితే ఈ శునకం చెపాక్ స్టేడియంలోనేదేనని తెలుస్తోంది.

 CSK vs LSG: Dog entered Chepauk kept running on the field goes viral

ఇటీవలే చెన్నై వేదికగా భారత్ -ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలోనూ ఇదే శునకం మైదానంలోకి వచ్చి ఆటకు అంతరాయం కలిగించింది. తాజా ఘటనతో ఈ విషయాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. మైదాన సిబ్బందే ఈ శునకాన్ని పెంచుతున్నారని కామెంట్ చేస్తున్నారు. కొందరైతే చెన్నై బ్యాటింగ్‌కు ముందు మైదానంలోకి గ్రాహ సింహం రావడం శుభసూచకమని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఐపీఎల్‌లో అవకాశం లేని పాక్ ఆటగాళ్లు ఇలా మైదానంలోకి వస్తున్నారని జోకులు పేల్చుతున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మైదానంలోకి వచ్చాడనే ఒకరంటే.. మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ఆ శునకాన్ని పంపించారని మరొకరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ శునకానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే.. లక్నో బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా గైక్వాడ్ భారీ సిక్సర్లు బాదుతున్నాడు. దాంతో 4.4 ఓవర్లలోనే చెన్నై 52 పరుగులు చేసింది.

Story first published: Monday, April 3, 2023, 20:15 [IST]
Other articles published on Apr 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+