Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs LSG: కైల్ మేయర్స్ విధ్వంసం.. చెపాక్‌లో గట్టెక్కిన చెన్నై!

చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సీఎస్‌కే 12 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌లో రుతురాజ్.. బౌలింగ్‌లో మొయిన్ అలీ సత్తా చాటడంతో చెపాక్ మైదానంలో చెన్నై శుభారంభం చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57), డెవాన్ కాన్వే(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. లక్నో బౌలర్లలో మార్క్ వుడ్, రవి బిష్ణోయ్ మూడేసి వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.

CSK edge LSG by 12 runs

అనంతరం చేజింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులే చేసి ఓటమిపాలైంది. కైల్ మేయర్స్(22 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ(4/16) నాలుగు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు తీసాడు. మిచెల్ సాంట్నర్‌కు ఓ వికెట్ దక్కింది. నికోలస్ పూరన్ ఔటవ్వడం లక్నో విజయవకాశాలను దెబ్బతీసింది. పూరన్ కొద్ది సేపు క్రీజులో ఉన్నా.. ఫలితం చెన్నైకి ప్రతికూలంగా ఉండేది.

218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్ల కైల్ మేయర్స్, కేఎల్ రాహుల్(20) శుభారంభం అందించారు. ముఖ్యంగా మేయర్స్.. చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో 5.3 ఓవర్లలోనే లక్నో 79 పరుగులు చేసింది. 21 బంతుల్లో‌నే మేయర్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మొయిన్ అలీ విడదీసాడు. కైల్ మేయర్స్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

ఆ వెంటనే దీపక్ హుడా(2)ను సాంట్నర్ ఔట్ చేయగా.. రాహుల్‌ను మొయిన్ అలీ పేవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా(9)సైతం మొయిన్ అలీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో మార్కస్ స్టోయినీస్(21), నికోలస్ పూరన్(32) ఆశలు రేకెత్తించారు.

కానీ స్టోయినీస్‌ను క్లీన్ బౌల్డ్ చేసి మొయిన్ అలీ మరోసారి దెబ్బతీసాడు. పూరన్ భారీ షాట్లతో విరుచుకుపడటంతో.. తుషార్ దేశ్‌పాండేతో ధోనీ అతనికి చెక్ పెట్టించాడు. దాంతో మ్యాచ్ చెన్నై వైపు మళ్లింది. రిక్వైడ్ రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో ఇంపాక్ట్ ప్లేయర్ ఆయూష్ బదోనీ కూడా ఏం చేయలేకపోయాడు. ఆఖరి ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు.

Story first published: Monday, April 3, 2023, 23:47 [IST]
Other articles published on Apr 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+