Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs KKR: రఫ్ఫాడించిన జడేజా.. తేలిపోయిన కేకేఆర్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. చెన్నై వెటరన్ స్పిన్నర్ రవీంద్ర జడేజా(3/18), తుషార్ దేశ్‌పాండే(3/33) మూడేసి వికెట్లు తీయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో9 వికెట్లకు 137 పరుగులే చేసింది.

శ్రేయస్ అయ్యర్(32 బంతుల్లో 3 ఫోర్లతో 34), సునీల్ నరైన్(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27), అంగ్‌క్రిష్ రఘువంశీ( 18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సీఎస్‌కే బౌలర్లలో జడేజా, తుషార్ దేశ్‌పాండేకు తోడుగా ముస్తాఫిజుర్ రెండు వికెట్లు తీయగా.. తీక్షణ ఓ వికెట్ పడగొట్టాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో బ్యాటింగ్‌కు కష్టంగా మారింది.

CSK vs KKR Ravindra Jadeja shines as CSK restrict KKR to 137 runs

సునీల్ నరైన్ మెరిసినా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు తొలి బంతికే బిగ్ షాక్ తగిలింది. తుషార్ దేశ్‌పాండే వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే ఫిల్ సాల్ట్(0) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

క్రీజులోకి వచ్చిన అంగ్‌క్రిష్ రఘువంశీ‌తో మరో ఓపెనర్ సునీల్ నరైన్ ధాటిగా ఆడాడు. తనదైన శైలిలో భారీ షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డు పరుగెత్తించాడు. దాంతో కేకేఆర్ పవర్ ప్లేలో 56 పరుగులు చేసింది.

CSK vs KKR Ravindra Jadeja shines as CSK restrict KKR to 137 runs

రఫ్ఫాడించిన జడేజా..
ఆ వెంటనే రంగంలోకి దిగిన రవీంద్ర జడేజా తన తొలి బంతికే రఘువంశీ(24)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. అదే ఓవర్‌లో సునీల్ నరైన్(27)ను క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బ తీసాడు.

తన మరుసటి ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్(3)ను ఔట్ చేసిన జడేజా.. కట్టడిగా బౌలింగ్‌ చేసి కేకేఆర్ జోరుకు బ్రేక్ వేసాడు. రమణ్ దీప్ సింగ్(13)తో కలిసి శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా.. తీక్షణ అడ్డుకున్నాడు.

నిప్పులు చెరిగిన ముస్తాఫిజుర్..
రమన్‌దీప్ సింగ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. పవర్ హిట్టర్ రింకూ సింగ్(10)ను తుషార్ దేశ్‌పాండే ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన రస్సెల్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో రస్సెల్ ఇచ్చిన క్యాచ్‌ను ధోనీ అందుకోలేకపోయాడు.

కానీ ఈ అవకాశాన్ని రస్సెల్ అందిపుచ్చుకోలేకపోయాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్‌లో అయ్యర్, మిచెల్ స్టార్క్ కూడా ఔటవ్వడంతో కేకేఆర్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.

Story first published: Monday, April 8, 2024, 21:24 [IST]
Other articles published on Apr 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+