చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 100 క్యాచ్‌ల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కేకేఆర్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో జడేజా ఈ ఫీట్ సాధించాడు.
ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఆఖరి ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్ అందుకోవడం ద్వారా ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు.

ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాబితాలో విరాట్ కోహ్లీ(110) టాప్‌లో ఉండగా.. సురేశ్ రైనా(109), రోహిత్ శర్మ(100), రవీంద్ర జడేజా(100), శిఖర్ ధావన్(98) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులే చేసింది. రవీంద్ర జడేజా(3/18), తుషార్ దేశ్‌పాండే(3/33) మూడేసి వికెట్లతో కేకేఆర్ పతనాన్ని శాసించగా.. తీక్షణ ఓ వికెట్ తీసాడు.
కేకేఆర్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్(32 బంతుల్లో 3 ఫోర్లతో 34), సునీల్ నరైన్(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27), అంగ్‌క్రిష్ రఘువంశీ( 18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 141 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(58 బంతుల్లో9 ఫోర్లతో 67 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డారిల్ మిచెల్(25), శివమ్ దూబే(28) మెరుపులు మెరిపించారు.
అప్‌ది ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ(1 నాటౌట్)తో రుతురాజ్ గైక్వాడ్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా రెండు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఫియర్‌లెస్ అటాకింగ్ గేమ్.. కట్టడైన బౌలింగ్‌తో గత మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన కేకేఆర్ ఈ మ్యాచ్‌లో మాత్రం సమష్టిగా విఫలమైంది. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై కేకేఆర్ బిగ్ హిట్టర్స్ తేలిపోయారు.