చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఓటమి ఎదురైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ పరాజయంతో చెన్నై.. పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలిచే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పేలవ బ్యాటింగ్ చెన్నై కొంపముంచగా.. రింకూ సింగ్, నితీశ్ రాణా 99 పరుగుల అసాధారణ భాగస్వామ్యం కేకేఆర్‌ను గెలిపించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. శివమ్ దూబే(34 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 48 నాటౌట్), రవీంద్ర జడేజా(20) రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్ రెండేసి వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరాకు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 147 పరుగులు చేసి 9 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. రింకూ సింగ్(43 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54), నితీశ్ రాణా(44 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లు తీయగా.. మహీశ్ పతీరణ ఓ వికెట్ పడగొట్టాడు.
145 పరుగుల స్వల్ప లక్ష్యచేధనలో కేకేఆర్‌కు గట్టి షాక్ తగిలింది. దీపక్ చాహర్ తన వరుస ఓవర్లలో రెహ్మానుల్లా గుర్బాజ్(1), వెంకటేశ్ అయ్యర్(9), జాసన్ రాయ్(12)లను పెవిలియన్ చేర్చాడు. ఈ ముగ్గుర్ని క్యాచ్ ఔట్ చేయడం గమనార్హం. దాంతో వపర్ ప్లేలో కేకేఆర్ 3 వికెట్లకు కోల్పోయి 46 పరుగులు చేసింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నితీశ్ రాణా, కెప్టెన్ రింకూ సింగ్ జట్టును ఆదుకున్నారు.
పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. రింకూ సింగ్ భారీ సిక్సర్లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే ముందుగా రింకూ సింగ్ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. 38 బంతుల్లో నితీశ్ రాణా అర్థ సెంచరీ సాధించాడు.
కేకేఆర్ విజయానికి 18 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన సమయంలో రింకూ సింగ్ ఔటవ్వడంతో కాస్త ఉత్కంఠతకు దారి తీసింది. నాలుగో వికెట్‌కు నమోదైన 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన రస్సెల్ సాయంతో నితీశ్ రాణా బౌండరీ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.