IPL 2022: రవీంద్ర జడేజా X శ్రేయస్ అయ్యర్.. బోణీ ఎవరిదో? తుది జట్లు ఇవే!

ముంబై: రెండు గ్రూప్‌లు.. 10 జట్లు.. 65 రోజులు..74 మ్యాచ్‌లు.. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ 2022 సీజన్ ముస్తాబైంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, గత రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య నేడు జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సీజన్‌కు తెరలేవనుంది. ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. గెలుపుతో ఈ సీజన్‌లో బోణీ కొట్టాలని ఉవ్విళ్లురుతున్నాయి. పేపర్‌పై ఇరు జట్లు బలంగా ఉండటంతో పాటు గత సీజన్ ఫైనల్ ఆడిన కెప్టెన్లు కాకుండా ఇరు జట్లలో సారథులు మారడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
2021 సీజన్లో అట్టడుగున నిలిచి, గత ఏడాది అంచనాల్లేకుండా బరిలోకి దిగి.. అద్భుత ఆటతో కప్పు ఎగరేసుకుపోయింది చెన్నై సూపర్ కింగ్స్. గతేడాది ప్రథమార్ధంలో పేలవ ప్రదర్శన చేసి, ద్వితీయార్ధంలో గొప్పగా పుంజుకుని ఫైనల్ చేరి త్రుటిలో కప్పు చేజార్చుకుంది కోల్‌కతా. ఈసారి సమవుజ్జీల్లా కనిపిస్తున్న ఈ జట్లలో శుభారంభం చేసేది ఏదో చూడాలి.

బలంగా చెన్నై..
ఇక లీగ్ ఆరంభం నుంచి ఆ జట్టును నడిపిస్తున్న ధోనీ.. తొలిసారి కేవలం సభ్యుడిగా బరిలోకి దిగుతున్నాడు. మహీ నుంచి ఈ సీజన్‌కు జడేజా పగ్గాలందుకున్న సంగతి తెలిసిందే. మరి కెప్టెన్‌గా జడ్డూ ఎలాంటి ముద్ర వేస్తాడు, బ్యాట్స్‌మన్‌గా ధోని ఎలా ఆడతాడు అన్నది ఆసక్తికరం. ధోని, జడేజాలతో పాటు రుతురాజ్, ఉతప్ప, రాయుడు, డ్వేన్ బ్రావో లాంటి పాత ఆటగాళ్లనే చెన్నై జట్టులో చూడబోతున్నాం. వీరికి యువ ఆల్‌రౌండర్ హంగారేర్కర్‌తో పాటు కివీస్ పేసర్ మిల్నె, తోడవుతున్నారు. పిచ్‌ను బట్టి పేసర్ జోర్డాన్ లేదా స్పిన్నర్ తీక్షణను చెన్నై ఎంచుకోనుంది.

రహానేకు చాన్స్..
మరోవైపు కోల్‌కతా.. కొత్త కెప్టెన్ శ్రేయస్‌కు తోడు, ఆల్‌రౌండర్లు వెంకటేశ్ అయ్యర్, రసెల్, నరైన్‌లే బలంగా బరిలోకి దిగుతోంది. నితీశ్ రాణా కూడా బ్యాటింగ్‌లో కీలకమే. ఫామ్‌లో లేకపోయినా రహానెకు తొలి మ్యాచ్‌లో ఓ అవకాశం ఇవ్వనుంది. అతనే వెంకటేశ్‌తో కలిసి ఓపెనింగ్ చేయనున్నట్లు సమాచారం.

ముఖా ముఖి పోరు..
ఇరు జట్ల మధ్య ముఖా ముఖి పోరులో కోల్‌కతాపై చెన్నై సూపర్ కింగ్స్‌దే ఆధిపత్యం. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 26 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో 17 చెన్నై గెలిచింది. 8 మ్యాచ్‌లు కేకేఆర్ గెలవగా.. ఒక్క మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. గత 5 మ్యాచ్‌ల్లో వరుసగా చెన్నై నాలుగు గెలవగా.. 2020 సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపొందింది.

తుది జట్లు (అంచనా)...
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, డేవాన్ కాన్వే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), శివమ్ దూబె, డ్వేన్ బ్రావో, హంగారేర్కర్, జోర్డాన్, తీక్షణ, మిల్నె
కోల్‌కతా: వెంకటేశ్ అయ్యర్, రహానె, శ్రేయస్, నితీశ్ రాణా, బిల్లింగ్స్ (వికెట్ కీపర్), రసెల్, నరైన్, చమిక కరుణరత్నె, మావి, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్/రసిక్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications