CSK vs KKR:మళ్లీ ఆరెంజ్ గ్లోవ్స్‌తో ధోనీ... కారణం అదేనా?

హైదరాబాద్: ఎంతగానో ఎదురుచూసిన ఐపీఎల్ 2022 సీజన్ సాదాసీదాగా ఆరంభమైంది. గత ఏడాది ఫైనలిస్ట్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఎలాంటి మెరుపులు, విధ్వంసక బ్యాటింగ్ లేకుండా సాఫీగా సాగిపోయింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సాధారణ స్కోరుకే పరిమితం కాగా... కేకేఆర్ ఆ తర్వాత ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యం చేరింది.
సీనియర్లు మహేంద్ర సింగ్ ధోనీ, అజింక్య రహానే తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడం ఒక్కటే చెప్పుకోదగ్గ విశేషం కాగా... కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన జడేజా అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో విఫలమయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ ఆరెంజ్ కలర్ కీపింగ్ గ్లోవ్స్‌తో బరిలోకి దిగడం చర్చనీయాంశమైంది.
కెరీర్ ఫస్ట్ మ్యాచ్‌లో...
భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడినప్పుడు ధోనీ ఆరెంజ్ కలర్ కీపింగ్ గ్లోవ్స్ ధరించాడు. కెప్టెన్‌గా తన తొలి టీ20 మ్యాచ్‌లో ఈ కలర్ కీపింగ్ గ్లోవ్స్‌నే ఉపయోగించాడు. ఆ తర్వాత సాధారణ గ్లోవ్స్ వాడిన ధోనీ మళ్లీ ఇన్నాళ్లకు ఆరెంజ్ గ్లోవ్స్‌తో బరిలోకి దిగడం విశేషం. అయితే ధోనీ ఇలా ఆరెంజ్ గ్లోవ్స్‌తో బరిలోకి దిగడంపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కెరీర్‌లో చివరి ఐపీఎల్ ఆడుతాన్ననని భావించే ధోనీ మళ్లీ ఆరెంజ్ కీపింగ్ గ్లోవ్స్ ధరించాడని కామెంట్ చేస్తున్నారు. ఇది రిటైర్మెంట్‌కు సంకేతమని కామెంట్ చేస్తున్నారు. మరికొందరూ మాత్రం ఈ సీజన్‌లో కేవలం ఆటగాడిగానే కొనసాగుతున్న ధోనీ.. అందేకే ఈ గ్లోవ్స్ ధరించి ఉంటాడని భావిస్తున్నారు. మొత్తాని ధోనీ ఆరెంజ్ గ్లోవ్స్ ధరించడం హాట్ టాపిక్ అయింది.
ఆరెంజ్ క్యాప్‌కు బదులు..
బ్యాటింగ్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌కు ఆరెంజ్ క్యాప్ ఇచ్చినట్లు.. కీపింగ్‌లో దిగ్గజమైన ధోనీకి బీసీసీఐ ఆరెంజ్ గ్లోవ్స్ ఇచ్చిందేమోనని ఇంకొందరూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించినప్పుడు ధోనీ ఇవే గ్లోవ్స్ వాడాడని, మళ్లీ 18 ఏళ్లకు వాటిని ధరించడం చూస్తుంటే అతనికి ఇదే చివరి ఐపీఎల్ ఏమోనని మరో అభిమాని పేర్కొన్నాడు. ధోనీ కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా స్వేచ్చగా ఆడాడని, మైదానంలో అతని శైలి చూస్తుంటే రిటైర్మెంట్ ఖాయమనిపిస్తుందన్నాడు. అలా ఆలోచిస్తే కన్నీళ్లు ఆగడం లేదని కామెంట్ చేశాడు.

ద్రవిడ్ రికార్డు బద్దలు..
కెప్టెన్‌గా బాధ్యతలు వదిలేసిన తొలి మ్యాచ్‌లోనే ధోనీ సత్తా చాటాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో పెద్ద వయసులో హాఫ్ సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా ధోనీ అరుదైన ఘనతను సాధించాడు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును అధిగమించాడు. రాహుల్ ద్రవిడ్ 40 ఏళ్ల 116 రోజులకు ఈ ఘనతను అందుకోగా.. ధోనీ 40 ఏళ్ల 262 రోజుల వయసులో హాఫ్ సెంచరీ అందుకొని దివాల్‌ను వెనక్కినెట్టాడు. దాదాపుగా మూడేళ్లలో ధోనీకిదే తొలి అర్థసెంచరీ. చివరగా అతను 2019, ఏప్రిల్ 21న అజేయంగా 84 పరుగులు చేశాడు. మొత్తంగా ఇది అతనికి 24వ హాఫ్ సెంచరీ.

చెన్నై చిత్తు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఎంఎస్ ధోనీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 50 నాటౌట్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 133 పరుగులు చేసింది. రహానే ( 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 34 బంతుల్లో 44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఉమేశ్ యాదవ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications