CSK vs KKR: రివ్యూ ఎవడు తీసుకోమన్నాడు.. జడేజాను మందలించిన ధోనీ!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ చెత్తాటతో ఓటమిపాలైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన చెన్నై 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. నయా కెప్టెన్ రవీంద్ర జడేజా చెత్త కెప్టెన్సీ టీమ్ కొంపముంచింది. కీలక నిర్ణయాలు తీసుకోవడంతో జడేజా తడబడ్డాడు. కెప్టెన్సీని ఒత్తిడిగా భావించాడు. దాంతో బ్యాటింగ్‌లోనూ రాణించలేకపోయాడు. తన సహజశైలికి భిన్నంగా ఆడిన జడేజా.. 28 బంతుల్లో 26 పరుగులే చేశాడు. ఇందులో ఒకే ఒక్క సిక్స్ కొట్టగా.. అది కూడా ఇన్నింగ్స్ చివరి బంతికి కొట్టిందే.

చెత్త కెప్టెన్సీ
ఇక జడేజా స్లో బ్యాటింగ్ ప్రభావం చెన్నై టీమ్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన జడేజా బౌలింగ్‌లోనూ తేలిపోయాడు. 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. కెప్టెన్‌గా బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ కూర్పుల విషయంలోనూ జడేజా తన మార్క్‌ని చూపెట్టలేకపోయాడు. చివరకు డీఆర్‌ఎస్ విషయంలోనూ తొందరపడి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ సింగ్ ధోనీ ఆగ్రహానికి గురయ్యాడు. కనీసం అతన్ని సంప్రదించకుండానే డీఆర్‌ఎస్ కోరడంపై మహీ కొప్పడ్డాడు. టీవీ కెమెరాల్లో ఇది స్పష్టంగా కనిపించింది.

అసలేం జరిగిందంటే..?
కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా మిచెల్ సాంట్నర్ వేసిన 14వ ఓవర్‌లో సామ్ బిల్లింగ్స్ రివర్స్ స్వీప్ ఆడాడు. అయితే.. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతి అతని బ్యాట్‌కు కనెక్ట్ కాలేదు. దాంతో.. ప్యాడ్‌ను తాకిందని భ్రమపడిన చెన్నై టీమ్.. ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం అప్పీల్ చేసింది. కానీ.. ఫీల్డ్ అంపైర్ అనిల్ కుమార్ చౌదరి ఆ అప్పీల్‌ని తిరస్కరించాడు. బంతి ప్యాడ్‌కు తాకిందని భ్రమపడిన రవీంద్ర జడేజా.. మహేంద్రసింగ్ ధోనీ అభిప్రాయం కూడా తీసుకోకుండానే డీఆర్‌ఎస్ కోరాడు.

కోపంతో ఊగిపోయిన ధోనీ..
కానీ.. రిప్లైలో బంతి శామ్ బిల్లింగ్స్ గ్లోవ్‌కి తాకినట్లు తేలింది. దాంతో.. అంపైర్ తన మునుపటి నిర్ణయానికే కట్టుబడగా.. చెన్నై టీమ్ రివ్యూ అవకాశాన్ని చేజార్చుకుంది. అనవసరంగా రివ్యూని జడేజా వేస్ట్ చేయడంతో ధోనీ అతనిపై కోప్పడుతూ కనిపించాడు. ఐపీఎల్ కెప్టెన్‌గా జడేజాకి ఇదే మొదటి మ్యాచ్‌కాగా.. మొదటి రివ్యూలోనే విఫలమయ్యాడు.

కేకేఆర్ సూపర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఎంఎస్ ధోనీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 50 నాటౌట్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 133 పరుగులు చేసింది. రహానే ( 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 34 బంతుల్లో 44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఉమేశ్ యాదవ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications