CSK vs KKR: అందుకే దీపక్ చాహర్‌ను తప్పించి అతన్ని తీసుకున్నాం: రుతురాజ్ గైక్వాడ్
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ వచ్చే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సీఎస్‌కే సారథి రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.
టాస్ సందర్భంగా మాట్లాడుతూ.. జట్టులో అనివార్య మార్పులు చేయాల్సి వచ్చిందన్నాడు. 'టాస్ గెలవడం మాకు కలిసొచ్చే అంశం. వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంది. ఈ రాత్రికి తేమ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం.

గత రెండు మ్యాచ్‌ల్లో ఓడినా మా ఆత్మవిశ్వాసం ఏ మాత్రం తగ్గలేదు. మేం చాలా చిన్న తేడాతో ఓటమిపాలయ్యాం. జట్టులో ప్రతీ ఒక్కరు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అయితే మా జట్టులో కొన్ని అనివార్య మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం.
కేకేఆర్ అసాధారణ క్రికెట్ ఆడుతోంది. మేం ప్రశాంతంగా ఉండి మా ప్రణాళికలకు తగ్గట్లు ఆడాలనుకుంటున్నాం. పతీరణ సెలెక్షన్‌కు అందుబాటులోకి రాలేదు. ముస్తాఫిజుర్ రీఎంట్రీ ఇచ్చాడు. ఫిట్‌నెస్ సమస్యలతో దీపక్ చాహర్ ఈ మ్యాచ్‌కు దూరంగా కాగా.. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగుతున్నాడు. సమీర్ రిజ్వీ సైతం రీఎంట్రీ ఇస్తున్నాడు.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.
టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ చేయాలనుకున్నామని కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకే రకమైన అప్రోచ్‌ను కొనసాగిస్తున్న తమ ఆటగాళ్లను అభినందించాల్సిందేనన్నాడు. 'గత మూడు మ్యాచ్‌ల్లో మేం చక్కగా పరిస్థితులను అంచనా వేసి అందుకు తగ్గట్లు మా ఆటను కొనసాగించాం.
జట్టులో ప్రతీ ఒక్కరు ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతున్నారు. సరైన సమయంలో సత్తా చాటుతున్నారు. చెన్నైతో ముఖా ముఖి పోరు ఓ చరిత్ర మాత్రమే. ఆ జట్టు వేరు.. అప్పటి పరిస్థితులు వేరు. మా ఆటతోనే మా సత్తా ఏంటో తెలియనుంది.
మేం సింపుల్‌గా ఉండటం చాలా ముఖ్యం. గతం గురించి పట్టించుకోకుండా.. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రస్తుత కాలంపైనే ఫోకస్ పెట్టాం. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
కేకేఆర్: ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, అంగ్‌క్రిష్ రఘు వంశీ, ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తీ
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications