Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs KKR Dream11: డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే

CSK vs KKR Dream11 Prediction: Fantasy Cricket Tips, Dream11 Team and Playing XI for IPL 2021 Final

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ఆరంభం కానుంనుండగా.. టాస్ 7 గంటలకు పడనుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లోనూ అభిమానులు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడోచ్చు.

క్వాలిఫయర్-1లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై గెలిచిన చెన్నై నేరుగా ఫైనల్‌కి చేరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌ని ఎలిమినేటర్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్‌ని క్వాలిఫయర్-2లో ఓడించిన కోల్‌కతా ఫైనల్‌కి దూసుకొచ్చింది. లీగ్ దశలో చెన్నై వరుస ఓటములను ఎదుర్కొనగా.. కోల్‌కతా మాత్రం వరుస విజయాలతో సత్తాచాటింది. దాంతో చెన్నైతో పోలిస్తే.. కోల్‌కతా ఇప్పుడు మంచి ఫామ్‌లో కనిపిస్తోంది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్

హెడ్ టు హెడ్ రికార్డ్స్

ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 17 మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించగా.. 9 మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో మాత్రం ఫలితం రాలేదు. గత ఆరు మ్యాచుల్లో కోల్‌కతాపై చెన్నై ఐదింటిలో గెలిచింది. ఫైనల్ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న దుబాయ్ పిచ్‌.. బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉండనుంది. అయితే మ్యాచ్‌ జరిగే కొద్దీ నెమ్మదించే ఈ పిచ్‌పై బంతి కూడా తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల స్పిన్నర్లు ప్రభావం చూపనున్నారు.

దుబాయ్ మైదానం పెద్దది కావడంతో బౌండరీలు రావడం కాస్త కష్టమే. ఛేజింగ్ చేసే జట్టుపై మంచు ప్రభావం కూడా ఉండనుంది. ఈ పిచ్ మీద ఇప్పటివరకు ఈ సీజన్లో 185 పరుగుల కంటే ఎక్కువ స్కోర్ నమోదు కాలేదు. ఇక్కడ సగటు స్కోర్ 150-170గా ఉంది. మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పులేదు. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకొనే అవకాశాలు ఉన్నాయి.

IND vs PAK: అలా ఆడితే టీమిండియాను ఓడించొచ్చు: మియాందాద్

కోల్‌కతా రికార్డును చెన్నై తిరగరాస్తుందా?

కోల్‌కతా రికార్డును చెన్నై తిరగరాస్తుందా?

14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కి చేరడం ఇది తొమ్మిదోసారి కాగా.. ఇప్పటికే మూడు సార్లు టైటిల్ గెలిచింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్‌కి చేరడం ఇది మూడో సారికాగా.. ఫైనల్ చేరిన రెండు సార్లూ టైటిల్ విజేతగా నిలిచింది. ఇప్పుడు ఈ ట్రాక్ రికార్డే చెన్నై జట్టులో టెన్షన్ పెంచుతోంది. ఐపీఎల్ ఫైనల్లో ఇప్పటి వరకూ కేవలం ఒకే ఒక సందర్భంలో చెన్నై, కోల్‌కతా జట్లు ఢీకొన్నాయి.

2012లో కోల్‌కతా.. చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్లో చెన్నైని 5 వికెట్ల తేడాతో ఓడించింది. 2014లోనూ ఫైనల్‌కి చేరిన కోల్‌కతా.. పంజాబ్ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో మూడోసారి కూడా అజేయ ఫైనల్‌ రికార్డుని కొనసాగించాలని కోల్‌కతా చోస్తోంది. చూడాలి మరి ఇప్పటికైనా కోల్‌కతా రికార్డును చెన్నై తిరగరాస్తుందో లేదో.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, మోయిన్ అలీ, రాబిన్ ఉతప్ప/సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, జోష్ హాజెల్‌వుడ్.

కోల్‌కతా నైట్ రైడర్స్:

శుభమాన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్/ఆండ్రీ రస్సెల్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి.

డ్రీమ్ 11 టీమ్

డ్రీమ్ 11 టీమ్

ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్, మొయిన్ అలీ, షకీబ్ అల్ హసన్ (వైస్ కెప్టెన్), దీపక్ చహర్, జోష్ హాజెల్‌వుడ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి.

Story first published: Friday, October 15, 2021, 13:55 [IST]
Other articles published on Oct 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+