Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs GT: రఫ్ఫాడించిన రచిన్ రవీంద్ర.. 9 బౌండరీలతో..!

ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లోనూ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. మొత్తం 9 బౌండరీలతో గుజరాత్ బౌలర్లను చెడుగుడు ఆడాడు.

అయితే ధాటిగా ఆడే క్రమంలో మరోసారి హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఉమేశ్ యాదవ్ వేసిన రెండో ఓవర్‌లో ఫైన్ లెగ్ దిశగా ఫ్లాట్ సిక్స్‌తో హిట్టింగ్‌కు తెరలేపిన రచిన్.. మరుసటి బంతిని కూడా బౌండరీకి తరలించాడు. అజ్మతుల్లా వేసిన మూడో ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు.

CSK vs GT Rachin Ravindra smashes 46 runs in 20 balls against Gujarat Titans in IPL 2024

ఇక ఉమేశ్ యాదవ్ వేసిన నాలుగో ఓవర్‌లో 6, 4 బాది తాను ఎంతటి డేంజరస్ బ్యాటరో చాటి చెప్పాడు. ప్రతీ ఓవర్‌లో ఓ బౌండరీ బాదుతూ గుజరాత్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. అజ్మతుల్లా వేసిన ఐదో ఓవర్‌లోనూ 6, 4 బాదిన రచిన్.. రషీద్ ఖాన్ వేసిన మరుసటి ఓవర్‌లో బౌండరీ బాది అదే జోరులో స్టంపౌటయ్యాడు.

నాలుగు పరుగుల దూరంలో మరోసారి హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. పవర్ ప్లే కండిషన్స్‌ను రెండు చేతులా అందిపుచ్చుకున్న రచిన్. సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు కావాల్సిన శుభారంభాన్ని అందించి వెనుదిరిగాడు.

శివమ్ దూబే( 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) విధ్వంసకర హాఫ్ సెంచరీతో పాటు రుతురాజ్ గైక్వాడ్(36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 46) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై సూపర్ కింగ్స్ 207 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది.

గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా.. సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీసారు.

Story first published: Tuesday, March 26, 2024, 20:45 [IST]
Other articles published on Mar 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+