Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే అంబటి రాయుడిని పక్కనపెట్టాం: మహేంద్ర సింగ్ ధోనీ

CSK vs GT: MS Dhoni reveals the real reason why Ambati Rayudu is not a part of playing XI

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేసిన చెన్నై.. బెంచ్ ప్లేయర్లకు అవకాశం కల్పించింది. ఈ వికెట్‌పై బ్యాటింగ్ సాగుతున్నా కొద్దీ నెమ్మదిస్తుందని, అందుకే ముందుగా బ్యాటింగ్ తీసుకున్నానని సీఎస్‌కే కెప్టెన్ ధోనీ తెలిపాడు. డేవాన్ కాన్వే టాపార్డర్‌లో అదరగొడుతున్నాడని చెప్పిన ధోనీ.. జట్టులోకి జగదీషన్, ప్రశాంత్ సోలంకి, సాంట్నర్, మతీషా వచ్చారని తెలిపాడు. రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, తీక్షణలకు ఉద్వాసన పలికినట్లు చెప్పుకొచ్చాడు. టీమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ ప్రయోగాలు చేస్తున్నామని ధోనీ తెలిపాడు. ఈ క్రమంలోనే రాయుడు, ఊతప్ప, బ్రావోలకు రెస్ట్ ఇచ్చామని స్పష్టం చేశాడు.

ఇక హార్దిక్ పాండ్యా సైతం టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునేవాడినని చెప్పాడు. ఎలంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.తమ అగ్రస్థానాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. 12 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న చెన్నై.. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి లీగ్‌ను ఘనంగా ముగించాలనుకుంటుంది. మరోవైపు గుజరాత్ మాత్రం తమ లోపాలను సరిదిద్దుకోవడానికి మిగిలిన లీగ్ మ్యాచ్‌లను వాడుకోవాలనుకుంటుంది.

తుది జట్లు(అంచనా)

సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, ఎన్ జగదీషన్, శివం దూబే, ఎంఎస్ ధోనీ(కెప్టెన్), మిచెల్ సాంట్నర్, ప్రశాంత్ సోలంకి,, సిమ్రన్‌జిత్ సింగ్, మతీశ పత్రీణ, ముఖేశ్ చౌదరి

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా(కీపర్), మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ మహమ్మద్ షమీ, సాయి కిషోర్, యశ్ దయాల్

Story first published: Sunday, May 15, 2022, 15:38 [IST]
Other articles published on May 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+