Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs GT: శివమ్ దూబే విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం!

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 207 పరుగుల భారీ లక్ష్యం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది.

శివమ్ దూబే( 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. రుతురాజ్ గైక్వాడ్(36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 46), రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా.. సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీసారు.

CSK vs GT IPL 2024 Shivam Dube smashing 2nd fastest fifty as CSK set 206 5

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే‌కు ఓపెనర్లు రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్‌లోనే రుతురాజ్ గైక్వాడ్ ఇచ్చిన క్యాచ్‌ను సాయి కిషోర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను చెలరేగాడు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర విధ్వంసకర బ్యాటింగ్‌తో రఫ్ఫాడించాడు.

వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. అదే జోరులో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. 4 పరుగుల దూరంలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. దాంతో సీఎస్‌కే పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే(12) విఫలమైనా.. శివమ్ దూబేతో కలిసి రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని స్పెన్సర్ జాన్సన్ స్టంపౌట్ చేశాడు. డారిల్ మిచెల్‌తో కలిసి శివమ్ దూబే చెలరేగాడు. భారీ సిక్సర్లతో గుజరాత్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. ఈ క్రమంలో అతను 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని జోరుకు శివమ్ దూబే బ్రేక్ వేసినా.. జడేజా జట్టు స్కోర్‌ను 200 ధాటించాడు.

Story first published: Tuesday, March 26, 2024, 21:29 [IST]
Other articles published on Mar 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+