Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs DC: ధోనీ విధ్వంసం.. ఢిల్లీ ముందు పోరాడే లక్ష్యం!

చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ( 9 బంతుల్లో, ఫోర్, 2 సిక్స్‌లతో 20) దుమ్మురేపాడు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న స్లోవికెట్‌పై తనదైన ట్రేడ్ మార్క్‌షాట్లతో చెలరేగాడు. అతనికి తోడుగా శివమ్ దూబే(12 బంతుల్లో 3 సిక్స్‌లతో 25), అంబటి రాయుడు (17 బంతుల్లో బౌండరీ, సిక్స్‌తో 23) మెరుపులు మెరిపించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది.

స్లో వికెట్ అయిన చెపాక్ స్టేడియంలో సీఎస్‌కే నమోదు చేసిన 168 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడం కష్టమే. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

 CSK vs DC
Photo Credit:

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు సరైన శుభారంభం దక్కలేదు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న ఢిల్లీ బౌలర్లు రఫ్ఫాడించారు. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లోనే ఓపెనర్ డేవాన్ కాన్వే(10) ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో పవర్ ప్లేలో చెన్నై వికెట్‌ నష్టానికి 49 పరుగులే చేసింది.

తన మరుసటి ఓవర్‌లో అక్షర్ పటేల్.. రుతురాజ్ గైక్వాడ్(24)ను కూడా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా.. మొయిన్ అలీ(7)ని కుల్దీప్ యాదవ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి దెబ్బతీసాడు. క్రీజులో సెట్ అయిన అజింక్యా రహానే(21)ను లలిత్ యాదవ్ స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు.

దాంతో చెన్నై 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో శివమ్ దూబే, అంబటి రాయుడు ధాటిగా ఆడారు. శివమ్ దూబే మూడు భారీ సిక్సర్లు బాదగా.. రాయుడు ఓ ఫోర్, సిక్సర్ కొట్టాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మిచెల్ మార్ష్ విడదీసాడు. శివమ్ దూబే(25)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 5వ వికెట్‌కు నమోదైన 36 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

రాయుడిని ఖలీల్ అహ్మద్ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన ధోనీతో రవీంద్ర జడేజా ధాటిగా ఆడి విలువైన పరుగులు చేశారు.. ఖలీల్ వేసిన 19వ ఓవర్‌లో ధోనీ రెండు సిక్స్‌లతో పాటు ఓ బౌండరీ బాదగా.. ఆఖరి ఓవర్‌లో జడేజా ఓ బౌండరీ బాది క్యాచ్ ఔట్ అయ్యాడు. ధోనీ కూడా భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఔటవ్వడంతో సీఎస్‌కే 170 పరుగుల మార్క్ అందుకోలేకపోయింది.

Story first published: Wednesday, May 10, 2023, 21:35 [IST]
Other articles published on May 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+