Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs DC: నమస్తే శంకరన్నా..!

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ విజయ్ శంకర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ 3డీ ప్లేయర్‌పై సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయ్ శంకర్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 69) హాఫ్ సెంచరీతో రాణించాడు. టెస్ట్ తరహా బ్యాటింగ్‌తో 43 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అతని జిడ్డు బ్యాటింగ్ కారణంగా ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(51 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులే చేసి ఓటమిపాలైంది. విజయ్ శంకర్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 69 నాటౌట్), ధోనీ(26 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 30 నాటౌట్) జట్టు విజయం కోసం కాకుండా జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించారు.

CSK vs DC IPL 2025 Vijay Shankar brutally trolled after his slow fifty knock

నమస్తే శంకరన్నా..
దాంతో విజయ్ శంకర్‌తో పాటు ధోనీపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా విజయ్ శంకర్‌ను ఫన్నీ మీమ్స్‌తో ఆడుకుంటున్నారు. 'నమస్తే శంకరన్నా.. ఈ హాఫ్ సెంచరీ ఎందుకే?'అని ప్రశ్నిస్తున్నారు. ప్రతీ ఐపీఎల్‌ సీజన్‌లో విజయ్ శంకర్ తన జిడ్డు బ్యాటింగ్‌తో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో విజయ్ శంకర్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ఢిల్లీ ఆటగాళ్లు వదిలేసారు.

అంతేకాకుండా ఎల్బీడబ్ల్యూ చేసే అవకాశం ఉన్నా రివ్యూ తీసుకోలేదు. విజయ్ శంకర్ క్రీజులో ఉంటేనే తమకు విజయం దక్కుతుందని ఢిల్లీ ఆటగాళ్లు భావించారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. విజయ్ శంకర్ క్యాచ్ డ్రాప్ అయిన అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ నవ్వాడని, అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ సీజన్‌లోనే అత్యంత చెత్త హాఫ్ సెంచరీ విజయ్ శంకర్‌ది అని కామెంట్ చేస్తున్నారు.

త్రీడీ ప్లేయర్..
శంకర్. త్రీడీ ఆటతో చెన్నై కొంపముంచేలా ఉన్నాడని మండిపడుతున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ భారత జట్టులో విజయ్ శంకర్ అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. తెలుగు తేజం అంబటి రాయుడిని కాదని ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ విజయ్ శంకర్‌కు అవకాశమిచ్చింది. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్.. త్రీ డైమన్షన్ నేపథ్యంలోనే అతని ఎంపిక చేశామని అప్పట్లో ఎమ్మెస్కే వివరణ ఇచ్చుకున్నాడు. దీనిపై రాయుడు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిచండంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగింది.

ఆ ప్రపంచకప్‌లో విజయ్ శంకర్ గాయం‌తో మధ్యలోనే తప్పుకోవడం.. నాలుగో స్థానంలో సరైన ఆటగాడు లేక భారత్ ఇంటిదారి పట్టడం జరిగిపోయింది. ఇక శంకర్ విఫలమైనప్పుడల్లా అభిమానులు ఈ విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడుతుంటారు. త్రీడీ ప్లేయర్ అంటూ అతనిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడినప్పుడు కూడా శంకర్ ఇలానే దారుణంగా విఫలమై.. అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.

Story first published: Sunday, April 6, 2025, 7:02 [IST]
Other articles published on Apr 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+