CSK vs DC: చెలరేగిన పంత్, షా.. చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ లక్ష్యం

దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో పృథ్వీషా (43 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 64), రిషభ్ పంత్ (25 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్) ధాటిగా ఆడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యర్థి ముందు 176 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(27 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్‌తో 37 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(26) ఫర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో చావ్లాకు రెండు వికెట్లు తీయగా.. సామ్ కరన్‌కు ఒక వికెట్ దక్కింది.

మంచి లైఫ్‌తో శుభారంభం..
దీపక్ చాహర్ వేసిన ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్.. పృథ్వీషా బ్యాట్‌కు ఎడ్జ్ కాగా.. వికెట్ కీపర్ ధోనీతో సహా బౌలర్ కూడా అప్పీల్ చేయలేదు. కానీ టీవీ రిప్లేలో బంతి బ్యాట్‌కు ఎడ్జ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. ఆ మరుసటి బంతులను షా వరుసగా బౌండరీకి తరలించాడు. రెండో ఓవర్‌ను కట్టడిగా వేసిన కరన్ రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. మూడో ఓవర్‌ను చాహర్‌తో కాకుండా జోష్ హజల్‌వుడ్‌తో వేయించిన ధోనీ.. ఢిల్లీ ఓపెనర్లను కట్టడిచేశాడు. కరన్ వేసిన నాలుగో ఓవర్‌లో షా రెండు బౌండరీలు కొట్టి రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నాడు. కానీ ఆ తర్వాత రెండు ఓవర్లలో బౌండరీలు రాకపోవడంతో ఢిల్లీ పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 35 రన్స్ చేసింది.
ధాటిగా ఆడిన షా, ధావన్..
పవర్ ప్లే అనంతరం షా, ధావన్ ధాటిగా ఆడారు. చావ్లా బౌలింగ్ షా రెండు బౌండరీలతో 13 రన్స్ రాబట్టగా.. అనంతరం జడేజా వేసిన ఫస్ట్ బాల్‌నే ధావన్ భారీ సిక్సర్‌తో బౌండరీల ఖాతా తెరిచాడు. నాలుగో బంతికి మరో బౌండరీ కొట్టడంతో ఈ ఓవర్‌లో కూడా 13 రన్స్ వచ్చాయి. ఇలా ఓవర్‌కు రెండు బౌండరీలు రాబట్టిన ఈ జోడీ.. స్కోర్ బోర్డు వేగాన్ని పెంచింది. ఈ క్రమంలో చావ్లా వేసిన తొమ్మిదో ఓవర్ రెండు, నాలుగో బంతులను బౌండరీలకు తరలించిన షా.. జడేజా వేసిన ఆ మరుసటి ఓవర్‌లో లెగ్ సైడ్ క్విక్ సింగిల్ తీసి ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కట్టడి చేసిన చెన్నై..
94 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీనీ చావ్లా తెలివైన బంతితో విడదీసాడు. అతను వేసిన 11 ఓవర్ మూడో బంతిని బౌండరీకి తరలించిన ధావన్(27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 35).. ఆ మరుసటి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. తన మరసటి ఓవర్‌లోనే చావ్లా వేసిన రెండో బంతిని తప్పుగా అంచనా వేసిన షా.. క్రీజును వీడి ధోనీ చేతిలో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ స్కోర్ బోర్డు వేగం కొంచెం మందగించింది. ఈ క్రమంలో రిషభ్ పంత్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరమ్మత్తులు చేపట్టారు. ఓవర్‌కో బౌండరీ కొడుతూ.. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నారు. కానీ 19వ ఓవర్‌లో సామ్ కరన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు ధోనీ సూపర్ క్యాచ్‌తో శ్రేయస్ అయ్యర్(22) పెవిలియన్ చేర్చాడు. దీంతో 58 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది. హజల్ వుడ్ వేసిన ఆఖరి ఓవర్‌లో 14 రన్స్ రావడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications