
పూర్ పవర్లే బ్యాటింగ్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు ఫాఫ్ డూప్లెసిస్(0), రుతురాజ్ గైక్వాడ్(5) ఆదిలోనే వరుస ఓవర్లలో వెనుదిరిగారు. దాంతో క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36), సురేశ్ రైనా (36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54) సెట్ అవ్వడానికి టైమ్‌కు తీసుకున్నారు.
దీనికి తోడు ఢిల్లీ పేసర్లు అవేశ్ ఖాన్, క్రిస్ వోక్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై పవప్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి కేవలం 33 పరుగులు చేసింది. ఆ తర్వాత మొయిన్ అలీ మెరుపులు.. సురేశ్ రైనా క్లాస్ బ్యాటింగ్.. చివర్లో సామ్ కరన్ విధ్వంసంతో చెన్నై ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలగింది.

పసలేని బౌలింగ్..
ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ తొలి వికెట్‌కు ఏకంగా 138 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి విజయానికి బాటలు వేసారు. ఈ ఇద్దర్ని ఔట్ చేయడంలో చెన్నై బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. పవర్ ప్లే స్పెషలిస్ట్ అయిన దీపక్ చాహర్‌తో పాటు సామకరన్ చెన్నైకి మంచి ఆరంభాన్ని అందించలేకపోయారు. వికెట్లు తీయడం దేవుడెరుగు... పోటీ పడి మరి పరుగులిచ్చుకున్నారు.
స్పిన్నర్లు మొయిన్ అలీ, రవీంద్ర జడేజా కూడా ప్రభావం చూపలేకపోయారు. డ్వేన్ బ్రేవో కొంత ఒత్తిడి తెచ్చినా.. ఇతర బౌలర్ల నుంచి అతనికి సహకారం అందలేదు. ఇక లార్డ్ శార్దూల్.. ఎప్పటిలానే వికెట్లు తీసినా అప్పటికే ఆలస్యమైంది. కానీ అతను అందరికంటే ఎక్కువగా పరుగులు సమర్పించుకున్నాడు. ఢిల్లీ పేసర్లు రాణించిన పిచ్‌పై చెన్నై బౌలర్లు చెతులెత్తేయడం ఆ జట్టును తీవ్రంగా దెబ్బతీసింది. పైగా నోర్జ్, రబడా లేకుండానే బరిలోకి దిగిన ఢిల్లీ తామెంత ప్రమాదకరమో ప్రత్యర్థులకు తెలియజేసింది.

చెత్త ఫీల్డింగ్..
పృథ్వీ షా ఇచ్చిన రెండు క్యాచ్‌లను చెన్నై ఆటగాళ్లు నేలపాలు చేశారు. ఈ రెండు తప్పిదాలు ఆ జట్టు ఓటమిని శాసించాయి. మొయిన్ అలీ వేసిన 8వ ఓవర్‌లో పృథ్వీ షా లాంగాఫ్ దిశగా ఆడగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ మిచెల్ సాంట్నర్ క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. బంతిని అంచనా వేయలేకపోయిన అతను.. ముందుకు డైవ్ చేయగా.. అతని చేతిలో పడిన బంతి బౌన్స్ అయ్యి నేలపాలైంది.
అప్పుడు షా చేసిన పరుగులు 38 మాత్రమే. ఆ తర్వాత మొయిన్ అలీ వేసిన 10 ఓవర్‌లో మరోసారి 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పృథ్వీ షా క్యాచ్ ఇచ్చాడు. కానీ.. ఈ సారి రుతురాజ్ గైక్వాడ్ ఆ క్యాచ్‌ని చేజార్చాడు. ఈ లైఫ్‌లతో మరింత రెచ్చిపోయిన పృథ్వీ షా.. తొలి వికెట్‌కి ధావన్‌తో కలిసి 13.3 ఓవర్లలో 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. ఢిల్లీ విజయానికి బాటలు వేశాడు. చివరికి డ్వేన్ బ్రావో బౌలింగ్‌లో మొయిన్ అలీ అతని క్యాచ్ పట్టాడు. ఈ రెండు క్యాచ్‌లు పట్టుంటే.. చెన్నైకి మ్యాచ్‌పై పట్టుబిగించే అవకాశం ఉండేది.

మరో 20 పరుగులు..
ఇక భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నై మరో 20 పరుగులు అదనంగా చేసుంటే ఫలితం మరోలా ఉండేది. మ్యాచ్ అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. డ్యూ ప్రభావం ఉన్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు కచ్చితంగా అదనపు పరుగులు చేయాల్సిందేనన్నాడు. 200+ స్కోర్ చేసుంటే ప్రత్యర్థి ఒత్తిడికి గురయ్యేదన్నాడు.
ఇక ఓ దశలో రైనా-అలీ దూకుడు చూసిన తర్వాత చెన్నై 200+ స్కోర్ సులువుగా చేస్తుందనిపించింది. కానీ అశ్విన్ బౌలింగ్‌లో మొయిన్ వరుస సిక్సర్ల బాది ఔటవ్వడం.. ఆ వెంటనే సురేశ్ రైనా కూడా రనౌట్‌గా వెనుదిరగడం చెన్నై పరుగుల వేగాన్ని తగ్గించింది. సురేశ్ రైనా మరికొద్దిసేపు క్రీజులో ఉంటే కచ్చితంగా చెన్నై భారీ స్కోర్ చేసేది.


Click it and Unblock the Notifications
