Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs CSK: నా పెళ్లాం.. చెన్నై జెర్సీ వేసుకోనిస్తలేదు భయ్యా!

CSK Twitter shares fan’s banner reading ‘wife did not allow me to wear CSK jersey’

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గత శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే.. మ్యాచ్ జరగుతుండగా ప్రేక్షకుల గ్యాలరీలో ఆర్‌సీబీ జెర్సీతో ఉన్న ఓ అభిమాని ప్లకార్డ్ ప్రదర్శించాడు. దానిపై 'నా పెళ్లాం చెన్నై జెర్సీ వేసుకోనివ్వడం లేదు భయ్యా'అని రాసుంది.

తాను చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమానినని, తన భార్య మాత్రం ఆర్‌సీబీ ఫ్యాన్ అని పరోక్షంగా చెప్పాడు. ఆమెను కాదనలేక ఆర్‌సీబీ జెర్సీ ధరించినట్లు చెప్పకనే చెప్పాడు. అయితే ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారడంతో తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్ వేదికగా స్పందించింది. ప్రేమ గుడ్డిదని మరోసారి నిరూపితమైందని బదులిచ్చింది. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కలర్ గుర్తించలేకపోతుందని సరదాగా రాసుకొచ్చింది. ఇక అభిమానులు మాత్రం ఫన్నీగా స్పందిస్తున్నారు. 'ఆర్‌సీబీ ఫ్యాన్ గర్ల్.. చెన్నై ఫ్యాన్ బాయ్.. ఇద్దరిది చూడ చక్కని జోడీ'అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరేమో పెళ్లి చేసుకోకుండా ఉన్నందుకు సంతోషిస్తున్నామని సెటైరిక్‌గా ట్వీట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(41 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో 53), దేవదత్ పడిక్కల్(50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్(11), టీమ్ డేవిడ్(1), మ్యాక్స్‌వెల్(9) దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో మూడు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్‌కు ఓ వికెట్ దక్కింది. మరోసారి వికెట్ల వెనుకాల మహేంద్రుడు తన మాయాజాలం‌తో ఆర్‌సీబీని తక్కువ స్కోర్‌‌కే పరిమితం చేశాడు. తొలి వికెట్‌కు కోహ్లీ, పడిక్కల్ 111 పరుగులు జోడించగా మిగతా బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు. చివరి రెండు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి కేవలం 6 పరుగులు మాత్రమే చేశారు.

అనంతరం చేజింగ్‌కు దిగిన చెన్నై 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 157 రన్స్ చేసి సునాయస విజయాన్నందుకుంది. రుతురాజ్ గైక్వాడ్(26 బంతుల్లో 38), ఫాఫ్ డుప్లెసిస్(26 బంతుల్లో 31), అంబటి రాయుడు(22 బంతుల్లో 32) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. చాహల్, మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ తీశారు.

Story first published: Sunday, September 26, 2021, 11:12 [IST]
Other articles published on Sep 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+