Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ధోనీ లేకున్నా సీఎస్‌కేనే టాప్.. వెనుకంజలో ఆర్‌సీబీ, ముంబై!

ఐపీఎల్ 2026 సీజన్‌ తుది దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారడంతో మ్యాచ్‌లపై అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఆరంభ మ్యాచ్‌లు కాస్త బోరింగ్‌గా అనిపించినప్పటికీ.. సెకండాఫ్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి.

ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ప్రతీ జట్టు తమ సాయశక్తులా పోరాడుతున్నాయి. దాంతో లీగ్ వీక్షకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ సీజన్‌లో టీవీ, డిజిటల్ వేదికగా అత్యధిక వీక్షకులను ఆకర్షించిన టాప్ 5 జట్ల అధికారిక జాబితాను స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది.

అయితే ఈ జాబితాలో అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)ని వెనక్కి నెట్టి చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ లేకున్నా.. సీఎస్‌కే మ్యాచ్‌లకు అత్యధిక వ్యూస్ రావడం గమనార్హం.

CSK Tops IPL 2026 Viewership Charts Edging Past Defending Champions Royal Challengers Bengaluru

ఇప్పటివరకు పూర్తయిన 43 మ్యాచ్‌ల్లోని డేటా ఆధారంగా, చెన్నై సూపర్ కింగ్స్ సగటున 308 మిలియన్ల వీక్షకులతో అగ్రస్థానంలో నిలిచింది. మహేంద్ర సింగ్ ధోనీ ఆడకపోయినప్పటికీ.. సీఎస్‌కే అభిమాన బలం ఏ మాత్రం తగ్గలేదని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

ఐపీఎల్ 2025 సీజన్‌లో రజత్ పాటిదార్ సారథ్యంలో టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 303 మిలియన్ల సగటు వీక్షకులతో రెండో స్థానంలో ఉంది. విరాట్ కోహ్లీ అపరిమిత అభిమాన బలమే ఈ వ్యూస్‌కు కారణం. CSK, RCBల మధ్య కేవలం 5 మిలియన్ల వీక్షకుల వ్యత్యాసం మాత్రమే ఉంది. ప్రస్తుత టోర్నీలో వరుస ఓటములను చవిచూసినప్పటికీ, ముంబై ఇండియన్స్ 293 మిలియన్ల వీక్షకులతో మూడో స్థానంలో నిలిచింది. వారి బలమైన అభిమాన మద్దతు ఈ స్థానానికి కారణం.

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి దూకుడైన బ్యాటర్లతో అందరి దృష్టిని ఆకర్షించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 290 మిలియన్ల వీక్షకులతో నాలుగో స్థానంలో నిలవగా.. సీజన్ తొలి భాగంలో అంతగా మెప్పించలేకపోయిన కోల్‌కతా నైట్ రైడర్స్, 280 మిలియన్ల వీక్షకులతో ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. జట్ల ఓటములతో సంబంధం లేకుండా ఆయా ఫ్రాంచైజీల అభిమానులు తమ విధేయతను చాటుకున్నారు.

Story first published: Saturday, May 9, 2026, 16:38 [IST]
Other articles published on May 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+