
పాత ఆటగాళ్లే 8 మంది..
ఈ సారి కూడా అదే మహిమతో జట్టుకు టైటిల్ అందించి ఆటకు ఘనంగా వీడ్కోలు పలకాలనుకుంటున్నాడు. చెన్నై టీమ్, అభిమానులు కూడా తమ బాస్ ధోనీకి చిరస్మరణీ విజయంతో టాటా చెప్పాలనుకుంటున్నారు. అప్‌కమింగ్ ఐపీఎల్ 2022 సీజన్ కోసం జరిగిన మెగా వేలంలో చెన్నై అద్భుత స్ట్రాటజీ కనబర్చింది.
సీనియర్ బ్యాట్స్‌మన్, చిన తాల సురేశ్ రైనాను కోనుగోలు చేయకపోవడం మినహా మంచి టీమ్‌ను తీసుకుంది. గతేడాది చాంపియన్‌గా నిలిచిన జట్టులో 8 మంది ప్లేయర్లను మళ్లీ కొనుగోలు చేసింది. ఇందులో నలుగురి రిటైన్ చేసుకోగా.. మరో నలుగురి వేలంలో తీసుకుంది. ఢిఫెండింగ్ చాంపియన్ టీమ్ నుంచి కేవలం ముగ్గురు ఆటగాళ్లు (ఫాఫ్ డుప్లెసిస్, శార్దూల్ ఠాకూర్, జోష్ హజెల్ వుడ్) మాత్రమే మిస్సయ్యారు.

ధోనీ మార్క్ సెలెక్షన్..
పాత ఆటగాళ్లపైనే నమ్మకం ఉంచిన సీఎస్‌కే మెగా వేలంలో వారినే తీసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చింది. గుడ్డిగా ఆడగాళ్లను కొనుగోలు చేయకుండా ఓ లెక్కతో తీసుకుంది. ఆటగాళ్ల ఎంపికలో ధోనీ మార్క్ కనిపించింది. ఒకే తరహా బౌలింగ్ శైలి కలిగిన శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌లకు భారీ డిమాండ్ ఉండటంతో ఒకరిని వదిలేసింది. దీపక్ చాహర్‌కు రూ.14 కోట్లు వెచ్చించి మరీ తీసుకుంది.
వేలంలో ఓ ఆటగాడి కోసం చెన్నై ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేయడం ఇదే తొలిసారి. పవర్ ప్లేలో వికెట్ తీసే సామర్థ్యం కలిగిన దీపక్‌ను ధోనీ తీర్చిదిద్దాడు. ఆ క్రమంలోనే అతనిపై చెన్నై నమ్మకం ఉంచింది.ఇక శ్రీలంక మిస్టరీ బౌలర్ మహీష్ తీక్షణతో పాటు న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవాన్ కాన్వేలను చెన్నై తీసుకుంది. ఫాఫ్ డుప్లెసిస్ చేజారడంతో అతని స్థానాన్ని కాన్వేతో భర్తీ చేయాలని భావిస్తోంది.

బ్యాకప్ బలహీనంగా..
ఫస్ట్ ఫైనల్ ఎలెవన్ పటిష్టంగా ఉన్నప్పటికీ బెంచ్ టీమ్ బలహీనంగా కనిపిస్తోంది. దీపక్ చాహర్ తోడుగా ఓ గన్ షాట్ బౌలర్ కూడా లేడు. శార్దూల్ ఠాకూర్ స్థానాన్ని తుషార్ దేశ్ పాండే ఏమేరకు భర్తీ చేస్తాడానేది సందేహమే. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున దేశ్ పాండే నిరూపించుకున్నప్పటికీ.. చెన్నై తరఫున సత్తా చాటుతాడో లేదో చూడాలి. హజెల్ వుడ్ లేని లోటును ఆడమ్ మిల్నే తీర్చుతాడా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇక స్టార్ ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్‌లా డేవాన్ కాన్వే రాణిస్తే పర్లేదు. లేకుంటే సమస్యలు తప్పవు. శివమ్ ధూబే రాణించడంపై కూడా సందేహాలున్నాయి. అయితే ధోనీ మార్క్ కెప్టెన్సీలో ఈ ఆటగాళ్లంతా షైన్ అవుతారనే నమ్మకం మాత్రం అభిమానులకు ఉంది.

ఓపెనర్లుగా రుతురాజ్, డేవాన్ కాన్వే..
ఇక తుది జట్టు ఎంపికను అంచనా వేస్తే.. డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. గత సీజన్‌లో రుతురాజ్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచి చెన్నై టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఫస్ట్ డౌన్‌లో ఆల్‌రౌండర్ మోయిన్ అలీ బ్యాటింగ్‌కు రానున్నాడు. నాలుగో స్థానంలో శివమ్ దూబే, రాబిన్ ఊతప్పల్లో ఒకరికి అవకాశం దక్కనుంది.
అనుభవానికి ఓటేస్తే ఊతప్ప.. బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే దూబేకు చోటివ్వవచ్చు. ఐదో స్థానంలో అంబటి రాయుడు, ఆరో ప్లేస్‌లో హిట్టర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేయనుండగా.. ఏడో స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ బరిలోకి దిగే అవకాశం ఉంది. పేసర్లు డ్వేన్ బ్రావోతో పాటు ఆడమ్ మిల్నే, దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండేకు చోటు దక్కవచ్చు. అయితే 9వ స్థానం వరకు బ్యాటింగ్ డెప్త్ ఉండటం చెన్నై టీమ్‌కు ప్లస్ పాయింట్.

తుది జట్టు (అంచనా)
డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మోయిన్ అలీ, శివమ్ ధూబే/ఊతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, డ్వేన్ బ్రావో/క్రిస్ జోర్డాన్, దీపక్ చాహర్, ఆడమ్ మిల్నే, తుషార్ దేశ్‌పాండే/సోలంకి/ రాజవర్థన్ హంగార్గేకర్

పూర్తి జట్టు
దీపక్ చాహర్(రూ.14 కోట్లు), అంబటి రాయుడు(రూ.6.75 కోట్లు), డ్వేన్ బ్రావో(4.40 కోట్లు), శివమ్ దుబే(రూ.4 కోట్లు), క్రిస్ జోర్డాన్(రూ.3.60 కోట్లు), రాబిన్ ఊతప్ప(రూ.2 కోట్లు), మిచెల్ సాంట్నర్(రూ.1.90 కోట్లు), ఆడమ్ మిల్నే(రూ.1.90 కోట్లు), రాజ్‌వర్ధన్ హంగార్గేకర్(రూ.1.50 కోట్లు), ప్రశాంత్ సోలంకీ (రూ.1.20 కోట్లు), డేవాన్ కాన్వే(రూ. కోటి), మహీష్ తీక్షణ(రూ.70 లక్షలు), డ్వేన్ ప్రిటోరియస్(రూ.50 లక్షలు), హరి నిశాంత్(రూ.20 లక్షలు), జగదీషన్(రూ.20 లక్షలు), ఆసిఫ్(రూ.20 లక్షలు), తుషార్ దేశ్‌పాండే(రూ.20 లక్షలు), సిమ్రజీత్ సింగ్(రూ.20 లక్షలు), సుభ్రాన్షు సేనాపతి(రూ.20 లక్షలు), ముఖేష్ చౌదరి(రూ.20 లక్షలు), కే భగత్ వర్మ(రూ.20 లక్షలు)


Click it and Unblock the Notifications












