Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024 : డేంజరస్‌గా చెన్నై సూపర్ కింగ్స్.. పూర్తి జట్టు ఇదే!

ఐపీఎల్ 2024 వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ చాలా స్మార్ట్‌గా వ్యవహరించింది. టీమ్ బలహీనతలపైనే ఫోకస్ పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి తప్పిదాలు చేయకుండా తమకు కావాల్సిన ఆటగాళ్లనే ఎంచుకుంది. రూ. 31.40 కోట్ల పర్స్‌ మనీతో వేలానికి వచ్చిన ధోనీ సేన దుబార చేయకుండా జాగ్రత్తగా ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

ఊహించినట్లుగానే టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్‌ను తీసుకుంది. రచిన్ రవీంద్రను (రూ. 1.8 కోట్లు) చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. డారిల్ మిచెల్ కోసం రూ. 14 కోట్లు ఖర్చు చేసింది. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ లోటును భర్తీ చేసిన ధోనీ సేన.. అంబటి రాయుడు స్థానాన్ని దేశవాళీ సెన్సేషన్ సమీర్ రిజ్వీతో భర్తి చేసింది.

CSK squad IPL 2024: Chennai Super Kings full list of players after auction

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ కుర్రాడి కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ. 8.40 కోట్లు ఖర్చు పెట్టింది. సురేశ్ రైనా తరహాలో ఆడటమే సమీర్ రిజ్వీ ప్రత్యేకం. దేశవాళీ క్రికెట్‌లో అతను పరుగుల వరద పారించాడు. దాంతో అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. చివరకు చెన్నై పట్టు వదలకుండా ప్రయత్నించి సొంతం చేసుకుంది.

టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను రూ. 4 కోట్లకే చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. గతంలో చెన్నైకే ఆడిన అతను మళ్లీ సొంత గూటికి చేరాడు. చెన్నైకి ఆడే సమయంలో ఓ వెలుగు వెలిగిన శార్దూల్.. పూర్వ వైభవం అందుకునేందుకు సిద్దమవుతున్నాడు. ఓవర్‌సీస్ పేసర్‌గా బంగ్లాదేశ్ వెటరన్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ చెన్నై కొనుగోలు చేసింది. రూ. 2 కోట్లకే అతన్ని సొంతం చేసుకుంది. తెలుగు తేజం, యువ వికెట్ కీపర్ అవనీష్ అరవెల్లిని రూ. 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.

CSK squad IPL 2024: Chennai Super Kings full list of players after auction

వేలం అనంతరం సీఎస్‌కే కుర్రాళ్లు, అనుభవం కలిగిన ప్లేయర్లతో సమతూకంగా కనిపిస్తోంది. చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకూలం కాగా.. జట్టులో ఎక్కువగా స్పిన్ ఆల్‌రౌండర్లు ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. పైగా ఓవర్‌సీస్ ఆటగాళ్లలో న్యూజిలాండ్ ఆటగాళ్లదే అగ్రస్థానం కావడం గమనార్హం. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్.. పేపర్‌పై చాలా డేంజరస్‌గా కనిపిస్తోంది.

గత సీజన్‌లో బౌలింగ్ విభాగంలో కాస్త బలహీనంగా కనిపించిన సీఎస్‌కే.. వేలంలో ఆ సమస్యను కూడా అధిగమించింది.

చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన ప్లేయర్లు:
రచిన్ రవీంద్ర-రూ. 1.8 కోట్లు
శార్దూల్ ఠాకూర్-రూ. 4 కోట్లు
డారిల్ మిచెల్-రూ. 14 కోట్లు
సమీర్ రిజ్వీ- రూ. 8.40 కోట్లు
ముస్తాఫిజుర్ రెహ్మాన్- రూ. 2 కోట్లు
అవనీష్ అరవెల్లి- రూ. 20 లక్షలు

చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ లిస్ట్:

మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగార్గేకర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీష పతీరణ, సిమ్రాన్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలాంకి, మహీశ్ తీక్షణ, అజింక్యా రహానే, షేక్ రషీద్, నిశాంత్ సిందు, అజయ్ మండల్

టీమ్ కాంబినేషన్:
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, అజింక్యా రహానే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్/మతీష పతీరణ

Story first published: Thursday, December 21, 2023, 8:07 [IST]
Other articles published on Dec 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+