IPL 2022: ధోనీ మార్క్ ఫార్ములా.. ఓల్డ్ ఈజ్ గోల్డ్! చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఇదే!

బెంగళూరు: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ తమ మాజీ ఆటగాళ్లకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మహేంద్ర సింగ్ ధోనీ మార్క్ ఫార్మూలా 'ఓల్డ్ ఈజ్ గోల్డ్'ను మళ్లీ రిపీట్ చేసింది. శనివారం జరిగిన వేలంలో ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే సీఎస్‌కే కొనుగోలు చేసింది. అందులో నలుగురు తమ పాత ప్లేయర్లే ఉండటం విశేషం. దీపక్ చాహర్‌ను అత్యధికంగా రూ.14 కోట్లకు తీసుకున్న ధోనీసేన.. అంబటి రాయుడు(రూ.6.75 కోట్లు), డ్వేన్ బ్రావోను 4.40 కోట్లకు తీసుకుంది. రాబిన్ ఊతప్పను అతని కనీస ధర రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక అనామక ప్లేయర్లు కేఎం ఆసిఫ్(రూ.20 లక్షలు), తుషార్ పాండే(రూ.20 లక్షలు) కొనుగోలు చేసింది.

ఇంకా రూ.20.45 కోట్లే..
చెన్నైలో ఓ వికెట్ కీపర్, ఓపెనర్‌తో పాటు ఇద్దరు ఆల్‌రౌండర్లు, పేసర్లు ఉన్నారు. మరో ఇద్దరు బ్యాట్స్‌మన్ ఉన్నారు. ఇంకా ఆ జట్టు బ్యాకప్ వికెట్ కీపర్‌తో పాటు స్టార్ ఓపెనర్, స్పెషలిస్ట్ స్పిన్నర్, బ్యాకప్ బ్యాట్స్‌మన్‌లను తీసుకోవాల్సి ఉంది. 9 మంది ప్లేయర్ల కోసం రూ. 69.5 కోట్లను సీఎస్‌కే ఖర్చు చేయగా.. ఆ జట్టు దగ్గర ఇంకా రూ.20.45 కోట్లు ఉన్నాయి. ఈ రోజు జరిగే వేలంలో ఫారిన్ ప్లేయర్లను చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ చేసే చాన్సుంది.

షెఫెర్డ్ టార్గెట్..
ఓపెనర్లుగా సౌతాఫ్రికా ప్లేయర్స్ రస్సీ వ్యాండెర్ డస్సెన్‌తో పాటు ఎయిడెన్ మార్క్‌రమ్, ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలన్, న్యూజిలాండ్ ప్లేయర్ డెవాన్ కాన్వేల కోసం చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడే అవకాశం ఉంది. వెస్టిండీస్‌కు చెందిన ఎవిన్ లెవిస్, ఓడియన్ స్మిత్, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రోమారియో షెఫేర్డ్‌ను కూడా టార్గెట్ చేయనుంది. ఆస్ట్రేలియన్ క్రిస్ లీన్, బెన్ మెక్‌డెర్మట్‌లను కూడా ట్రై చేసే చాన్సుంది.

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్:
రవీంద్ర జడేజా(రూ.16 కోట్లు) (ఆల్‌రౌండర్)
మహేంద్ర సింగ్ ధోనీ(రూ.14 కోట్లు) (కీపర్)
మొయిన్ అలీ( రూ.8 కోట్లు) (ఆల్‌రౌండర్)
రుతురాజ్ గైక్వాడ్(రూ.6 కోట్లు) (ఓపెనర్)
దీపక్ చాహర్ (రూ.14 కోట్లు) (బౌలర్)
అంబటి రాయుడు(రూ. 6.75 కోట్లు) ( మిడిలార్డర్ బ్యాట్స్‌మన్)
డ్వేన్ బ్రావో(రూ. 4.40 కోట్లు) (బౌలర్)
రాబిన్ ఊతప్ప(రూ. 2 కోట్లు) (బ్యాట్స్‌మన్)
కేఎం ఆసిఫ్ (రూ.20 లక్షలు)
తుషార్ పాండే(రూ.20 లక్షలు)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications