నంబర్ 7 నా లక్కీ నెంబర్ కాదు.. అందుకే ఆ నంబర్‌ను ఫాలో అవుతున్న: ధోనీ

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ లక్కీ నంబర్ ఏదని ప్రశ్నిస్తే.. అందరూ నెంబర్ 7 అని చెబుతారు. ఎందుకంటే అతను అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఆ నెంబర్ జెర్సీనే ధరిస్తున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించినా.. ఐపీఎల్‌లోనూ అదే నంబర్ జెర్సీని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే నంబర్ 7 అనేది ధోనీ లక్కీ నంబరని అంతా అనుకుంటారు. అయితే అది తన లక్కీ నంబర్ కాదని ధోనీ స్వయంగా చెప్పాడు. ఐపీఎల్ 2022 సీజన్ కోసం సమాయత్తం అవుతున్న ధోనీ.. తాజాగా అభిమానులతో వర్చువల్‌గా నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన నెంబర్ 7 వెనుక ఉన్న కథ గురించి చెప్పుకొచ్చాడు.

నా బర్త్‌డే డేట్ నెంబర్ కావడంతో..
'నా కెరీర్ ఆరంభంలో చాలా మంది నెంబర్ 7 నా లక్కీ నంబర్ అనుకున్నారు. కానీ, అలా కాదు. ఓ చిన్న కారణం చేతనే నేను 7 నంబర్ జెర్సీని ఎంపిక చేసుకున్నా. నేను పుట్టిన తేది జులై 7. అంటే అది ఏడో నెల ఏడో తారీఖు. అందుకే దాన్ని ఎంపిక చేసుకున్నా. నాకు ఏ సంఖ్య కలిసివస్తుందనే విషయంలో అవీ ఇవీ ఆలోచించకుండా పుట్టిన తేదీనే తీసుకోవాలనుకున్నా.

81లో పుట్టా..
అలాగే ఎవరైనా నన్ను 7 ఎందుకు ఇష్టమని అడిగితే.. నేను పుట్టింది 81వ సంవత్సరంలో కాబట్టి.. 8 నుంచి 1ని తీస్తే 7 వస్తుందని చెప్పేవాడిని. దాంతో చాలా మంది 7 అనేది న్యూట్రల్ నంబర్ అని, దానివల్ల చెడు కానీ, మంచి కానీ పెద్దగా ప్రభావం చూపదని చెప్పారు. దీంతో నేను కూడా అలాగే వేరేవాళ్లకి చెప్పేవాడిని. అయితే, ఈ విషయంలో నేనేమీ మూఢ నమ్మకంతో ఉండను. ఆ సంఖ్య నా మనసుకు నచ్చింది కాబట్టే దాన్నే ఫాలో అవుతున్నా' అని ధోనీ చెప్పుకొచ్చాడు.

సింగమ్స్ ఇన్ సూరత్..
ఐపీఎల్ 2022 సీజన్ టైటిలే లక్ష్యంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) తమ సన్నాహకాలను మొదలు పెట్టింది. అందరికన్నా 20 రోజుల ముందే ప్రాక్టీస్ క్యాంప్ షురూ చేసింది. లీగ్ మొత్తం ముంబై, పుణేల్లో జరగనున్న నేపథ్యంలో అదే తరహా మైదానం కలిగిన సూరత్‌లో చెన్నై శిక్షణా శిభిరం ఏర్పాటు చేసింది. సూరత్ వికెట్.. ముంబై మాదిరే ఉండటంతో ధోనీ తమ ప్రాక్టీస్ క్యాంప్‌ను ఇక్కడ ఏర్పాటు చేశాడు. కెరీర్‌లో చివరి ఐపీఎల్ లీగ్ ఆడుతున్న మహీ టైటిల్ గెలిచి ఘన వీడ్కోలు అందుకోవాలని భావిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications