ఇదేం బౌలింగ్ రా సామీ.. 123 పరుగులు ఇచ్చావ్!
ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) అనామక ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించింది. పుదుచ్చేరి కెప్టెన్ అమన్ ఖాన్‌ను సీఎస్‌కే రూ.40 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఈ వేలం ముగిసిన రెండు వారాల్లోనే అమన్ ఖాన్ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా అమన్ ఖాన్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.
ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ2025-26లో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అమన్ ఖాన్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 123 పరుగులు సమర్పించుకున్నాడు. అతని చెత్త బౌలింగ్‌తో జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 368 పరుగులు చేసింది.
తొలి బౌలర్‌గా..
లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా అమన్ ఖాన్ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ మిబోమ్ మోసు చెత్త రికార్డ్‌ను అధిగమించాడు. మిబోయ్ మోసు 10 ఓవర్లలో 116 పరుగులు సమర్పించుకున్నాడు. అతను కూడా ఈ ఏడాదే ఈ ఫీట్ సాధించడం గమనార్హం. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లలో అమన్ ఖాన్(123), మిబోమ్ మోసు(116) తర్వాత బాస్ డీ లీడే(115), పాట్రిక్ బ్రౌన్(114), చేతన్ ఆనంద్(114) తర్వాత స్థానాల్లో ఉన్నారు.

రూ.40 కోట్లు దండుగ..
అమన్ ఖాన్ బౌలింగ్ ప్రదర్శనపై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రూ.40 కోట్లు వృథా చేశారని మండిపడుతున్నారు. ఇలాంటి బౌలర్‌తో ఐపీఎల్ ఆడితే టైటిల్ గెలిచినట్లేనని మండిపడుతున్నారు. సీఎస్‌కే స్కౌట్స్ ఏం చేస్తున్నారని, అమన్ ఖాన్ కంటే మెరుగైన బౌలర్లు వారికి కనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు.
జార్ఖండ్ ఘన విజయం..
ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ 133 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 368/7 భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ దూరంగా ఉండగా.. కుమార్ కుశాగ్ర జట్టును నడిపించాడు. పుదుచ్చేరి 235 పరుగులకు ఆలౌటైంది. రాజ్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications