For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: బ్రావో ఔట్.. డుప్లెసిస్ డౌట్! ముంబైతో బరిలోకి దిగే సీఎస్‌కే టీమ్ ఇదే!

CSK probable Playing XI: Faf du Plessis sustains injury, Who will open with Ruturaj Gaikwad?

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌కు మరో 6 రోజుల్లో తెరలేవనుంది. అరబ్ గడ్డపై అత్యంత కఠినమైన బయో బబుల్‌లో ఈ క్యాష్ రిచ్ లీగ్ జరగనుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ యూఏఈ చేరి సాధన మొదలుపెట్టాయి. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత ఆటగాళ్లు సైతం యూఏఈకి చేరుకొని 6 రోజుల క్వారంటైన్‌ పాటిస్తున్నారు. సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ క్యాష్‌రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. అందరికన్నా ముందే అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో యూఏఈ చేరిన చెన్నై సూపర్ కింగ్స్.. ముమ్మరంగా సాధన చేస్తోంది.

ఫాఫ్, బ్రావోలకు గాయాలు..

ఫాఫ్, బ్రావోలకు గాయాలు..

ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు ఇద్దరు గాయపడగా.. మరో ఇద్దరు ప్లేఆఫ్స్ మ్యాచులకు దూరం కానున్నారు. సీపీఎల్ 2021లో ఆడుతున్న డ్వేన్ బ్రావో, ఫాఫ్ డుప్లెసిస్ గాయాల బారిన పడ్డారు. ఫాఫ్ గజ్జ గాయంతో బాధపడుతుండటంతో సీపీఎల్ లీగ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే అతని గాయం తీవ్రతపై స్పష్టత లేదు. దాంతో సీపీఎల్ సెమీ ఫైనల్ మ్యాచ్‌తో పాటు ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్‌లు ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇక ఫాఫ్ దూరమైతే చెన్నైకి ఎదురుదెబ్బే.

ఓపెనర్‌గా ఊతప్ప..

ఓపెనర్‌గా ఊతప్ప..

ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో డుప్లెసిస్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 7 మ్యాచ్‌ల్లో 320 పరుగులతో టాప్ బ్యాట్స్‌మన్ జాబితాలో కొనసాగుతున్నాడు. చెన్నై సాధించిన విజయాల్లో డుప్లెసిస్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అతని సేవలను కోల్పోవాల్సి రావడం ఆ జట్టును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అయితే డుప్లెసిస్ దూరమైతే అతని స్థానంలో రాబిన్ ఊతప్ప ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా ఊతప్పకు మంచి రికార్డు ఉంది. ఒకవేళ ఊతప్పను కాదనుకుంటే అంబటి రాయుడు ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. మరో ఓపెనర్‌గా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు.

మిడిలార్డర్‌లో సురేశ్ రైనా..

మిడిలార్డర్‌లో సురేశ్ రైనా..

నాలుగో స్థానంలో అంబటి రాయుడు బరిలోకి దిగనుండగా.. ఆ తర్వాత సురేశ్ రైనా, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బరిలోకి దిగనున్నాడు. ఏడో స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రానున్నాడు. ఇక డ్వేన్ బ్రావో గాయంతో దూరమవడంతో లుంగి ఎంగిడి తుది జట్టులోకి రానున్నాడు. గాయం కారణంగా బ్రావో సీపీఎల్ 2021లో బౌలింగ్ చేయడం లేదు. కేవలం బ్యాట్స్‌మన్‌గా మాత్రమే సేవలందిస్తున్నాడు. దాంతో ఐపీఎల్ టోర్నీలో కూడా అతను బౌలింగ్ చేసే అవకాశాలు లేవు. కాబట్టి కేవలం బ్యాటింగ్ కోసం అతనికి అవకాశం దక్కకపోవచ్చు.

శార్దూల్, దీపక్ చాహర్..

శార్దూల్, దీపక్ చాహర్..

ఇక జడేజా తర్వాత సామ్ కరన్ బ్యాటింగ్‌కు రానుండగా.. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌లు బరిలోకి దిగనున్నారు. జట్టులో 10 మంది ఆటగాళ్లకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటం విశేషం. ఒక్క లుంగి ఎంగిడి మినహా అందరూ బ్యాటింగ్ చేయగలరు. ఇక బౌలర్లుగా లుంగి ఎంగిడీ, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, సామ్ కరన్‌లు పేస్ బాధ్యతలు మోయనుండగా.. ఏకైక స్పిన్నర్‌గా జడేజా బౌలింగ్ చేయనున్నాడు. ఎక్స్‌ట్రా స్పిన్నర్ అవసరం అనుకుంటే శార్దూల్‌ ప్లేస్‌లో కృష్ణప్ప గౌతమ్ బరిలోకి దిగనున్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు(అంచనా)

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు(అంచనా)

రాబిన్ ఊతప్ప/ఫాఫ్ డూ ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మోయిన్ అలీ, అంబటి రాయుడు, సురేశ్ రైనా, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, సామ్ కరన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి

Story first published: Monday, September 13, 2021, 20:08 [IST]
Other articles published on Sep 13, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+