Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: పవర్‌ఫుల్‌గా చెన్నై సూపర్ కింగ్స్.. తుది జట్టు అంచనా ఇదే!

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిళ్లు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. మరో ట్రోఫీపై కన్నేసింది. ఐపీఎల్ 2026 ట్రోఫీ లక్ష్యంగా సన్నదమవుతుంది. చివరిసారిగా సీఎస్‌కే ఐపీఎల్ 2023 సీజన్‌లో విజేతగా నిలిచింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో తృటిలో ప్లే ఆఫ్స్ బెర్త్ చేజార్చుకున్న సీఎస్‌కే.. ఐపీఎల్ 2025 సీజన్‌లో చెత్త ప్రదర్శనతో అట్టడుగు స్థానంలో నిలిచింది.

దాంతో జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసింది. వేలానికి ముందే సంజూ శాంసన్‌ను ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకున్న సీఎస్‌కే అతని కోసం రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరణ్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు వదులుకుంది. డిసెంబర్ 16 అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలం‌లో కుర్రాళ్లపై కోట్లు కుమ్మరించింది. తమ సంప్రదాయానికి విరుద్దంగా అనామక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అనామక ఆటగాళ్లు అయిన ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ‌లపై సీఎస్‌కే కోట్లు కుమ్మరించింది. ఈ ఇద్దర్నీ సీఎస్‌కే రూ.14.20 కోట్ల చొప్పున కొనుగోలు చేసింది.

CSK Predicted Playing XI for IPL 2026 MS Dhoni Likely to Play as Impact Player

కుర్రాళ్లపై కోట్ల వర్షం..

అకీల్ హోస్సేన్‌ను రూ.2 కోట్లకు తీసుకున్న సీఎస్‌కే, మాథ్యూ షార్ట్ (రూ.1.5 కోట్లు), సర్ఫరాజ్ ఖాన్(రూ.75 లక్షలు) వంటి ప్లేయర్లను తీసుకుంది. స్పిన్నర్ రాహుల్ చాహర్‌ కోసం రూ.5.2 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సమతూకంగా కనిపిస్తోంది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో పవర్‌ఫుల్‌గా ఉంది. సంజూ శాంసన్ రాకతో సీఎస్‌కే బ్యాటింగ్ ఆర్డర్ బలంగా మారింది. ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచి ధోనీకి సగర్వంగా వీడ్కోలు పలకాలనే లక్ష్యంతో సీఎస్‌కే ఉంది.

కొత్త ఆటగాళ్ల చేరికతో పాటు యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో సీఎస్‌కే కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. రుతురాజ్ గైక్వాడ్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. ప్రశాంత్ వీర్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఆడనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా నూర్ అహ్మద్, రాహుల్ చాహర్‌లో ఒకరికి అవకాశం దక్కనుంది. పేసర్లుగా ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, నాథన్ ఎల్లిస్‌లకు అవకాశం దక్కనుంది. కార్తీక్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్నాడు. ధోనీని కూడా ఫినిషర్ పాత్రలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించే ఛాన్స్ ఉంది.


తుది జట్టు(అంచనా)

సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, రుతురాజ్ గైక్వాడ్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, మహేంద్ర సింగ్ ధోనీ, నూర్ అహ్మద్/రాహుల్ చాహర్, నాథన్ ఎల్లిస్/మాట్ హెన్రీ, ముఖేష్ చౌదరి/జెమీ ఓవర్టన్, ఖలీల్ అహ్మద్.

ఇంపాక్ట్ ప్లేయర్: కార్తీక్ శర్మ

Story first published: Tuesday, December 30, 2025, 14:14 [IST]
Other articles published on Dec 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+