Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK Playing XI: స్టార్ పేసర్ దూరం.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలడపే సీఎస్‌కే తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2024 సీజన్‌లో తొలి ఓటమిని ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. శుక్రవారం ఉప్పల్ వేదికగా సన్‌‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో సీఎస్‌కే విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ సీజన్‌ను గెలుపుతో ప్రారంభించిన చెన్నై.. అదే జోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది.

హోమ్ గ్రౌండ్‌లో చెలరేగిన సీఎస్‌కే.. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది.

CSK Playing XI vs SRH Mustafizur Rahman Out and Mukesh Choudhary In

ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసినా..
మరోవైపు కోల్‌కతా వేదికగా కేకేఆర్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్.. సొంతగడ్డపై భారీ విజయాన్ని నమోదు చేసింది. పటిష్ట ముంబై ఇండియన్స్‌‌ను చిత్తు చేయడంతో పాటు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసి ఆల్‌టైమ్ రికార్డు దక్కించుకుంది. అయితే అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఆ జట్టు ఆ జోరు కొనసాగించలేకపోయింది.

స్టార్ పేసర్ దూరం..
ఈ క్రమంలోనే సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్.. తమ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ సేవలను కోల్పోయింది. టీ20 ప్రపంచకప్ కోసం అమెరికా వెళ్లేందుక వీసా సమస్యలు తలెత్తడంతో తమ బోర్డు ఆదేశాలతో ముస్తాఫిజుర్ స్వదేశం వెళ్లిపోయాడు.

గత మూడు మ్యాచ్‌ల్లో అతను సీఎస్‌కే తరఫున కీలక పాత్ర పోషించాడు. అతని స్థానంలో మహీష్ తీక్షణ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ ముస్తాఫిజుర్ స్థానాన్ని లెఫ్మార్మ్ పేసర్‌తో భర్తీ చేయాలనుకుంటే మాత్రం ముకేష్ చౌదరీ జట్టులోకి వస్తాడు. ఈ ఒక్కటి మినహా జట్టులో ఎలాంటి మార్పు జరిగే అవకాశం లేదు.

ముకేష్ చౌదరీ జట్టులోకి వస్తే సీఎస్‌కే ముగ్గురు ఓవర్‌సీస్ ఆటగాళ్లతోనే బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

సీఎస్‌కే తుది జట్టు(అంచనా):

రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, మహీష్ తీక్షణ/ముకేష్ చౌదరి, దీపక్ చాహర్.

ఇంపాక్ట్ ప్లేయర్: తుషార్ దేశ్ పాండే

Story first published: Thursday, April 4, 2024, 19:04 [IST]
Other articles published on Apr 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+