Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK Playing XI vs RR:తుది జట్టులో వ్యూహాత్మక మార్పు.. రాజస్థాన్‌తో ఆడే ధోనీ సేన ఇదే!

జైపూర్: ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీ ఫస్టాఫ్‌లో ఏడు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచిన సీఎస్‌కే.. రెండో దశలోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటోంది.

మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్.. చెన్నైపై గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటోంది. బలబలాల దృష్ట్యా రెండు జట్లు సమతూకంగా ఉండటంతో హోరా హోరీ పోరు తప్పేలా లేదు.

CSK Playing XI vs RR

చెన్నై సూపర్ కింగ్స్ విజయ రహస్యం.. సమష్టిగా రాణిస్తుండటం. ముఖ్యంగా ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే అదిరిపోయే ఆరంభాలు ఇస్తుంటే వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే, ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. సూపర్ పెర్ఫామెన్స్‌తో రహానే మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకోగా.. శివమ్ దూబే కెరీర్ బెస్ట్ ఐపీఎల్ పెర్ఫామెన్స్ కనబరుస్తున్నాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరూ ఆడిన ఇన్నింగ్స్ అసాధారణం. ఫినిషర్‌గా ధోనీ, జడేజా అదరగొడుతున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతున్న అంబటి రాయుడికి బ్యాటింగ్ చేసే అవకాశాలు పెద్దగా రాకపోయినా.. ఆడిన బంతులను భారీ షాట్లుగా మలుస్తున్నాడు. బౌలింగ్‌లో తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్, మతీష పతీరణ సత్తా చాటుతుండగా.. స్పిన్నర్లుగా మహీశ్ తీక్షణ, రవీంద్ర జడేజా దుమ్మురేపుతున్నారు. మొయిన్ అలీ కూడా పర్వాలేదనిపిస్తున్నాడు.

ఈ అసాధారణ ప్రదర్శనతోనే చెన్నై సూపర్ కింగ్స్ గత మూడు మ్యాచ్‌ల్లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. అయితే జైపూర్ వేదికగా జరిగే నేటి మ్యాచ్‌లో సీఎస్‌కే వ్యూహాత్మక మార్పులు చేసే అవకాశం ఉంది.

సావాయి మాన్‌సింగ్ స్టేడియం పిచ్ చాలా స్లోగా ఉంటుంది. స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఇక్కడ జరిగిన గత మ్యాచ్‌(రాజస్థాన్-లక్నో) థ్రిల్లింగ్‌గా ముగియగా.. స్పిన్నర్లు అశ్విన్, రవి బిష్ణోయ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.

పిచ్ దృష్ట్యా సీఎస్‌కే వ్యూహాత్మక మార్పులు చేయవచ్చు. మొయిన్ అలీ స్థానంలో మిచెల్ సాంట్నర్‌ను తీసుకురావచ్చు. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చవద్దని భావిస్తే మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనున్నారు.

రాజస్థాన్‌తో సీఎస్‌కే తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ/మిచెల్ సాంట్నర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, మతీష పతీరణ, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ, ఆకాశ్ సింగ్

ఇంపాక్ట్ ప్లేయర్: అంబటి రాయుడు

Story first published: Thursday, April 27, 2023, 9:25 [IST]
Other articles published on Apr 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+