Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK Playing XI vs RR: జట్టులోకి మిస్టరీ స్పిన్నర్.. రాజస్థాన్‌తో ఆడే చెన్నై తుది జట్టు ఇదే!

చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బుధవారం చెన్నైలోని చెపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. గుజరాత్ టైటాన్స్‌తో తొలి ఓటమి అనంతరం లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్‌లను మట్టికరిపించిన చెన్నై.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

అయితే ఆ జట్టును గాయాల బెడద వేధిస్తోంది. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ మొకాలి గాయంతో బాధపడుతుండగా.. దీపక్ చాహర్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఈ ఇద్దరూ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యారు. స్వల్ప అస్వస్థతతో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్న మొయిన్ అలీ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు.

 Maheesh Theekshana

తెలుగు తేజం అంబటి రాయుడు, తుషార్ దేశ్ పాండేలను ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఆడించనున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు బ్యాటింగ్ చేస్తే మరొకరు బౌలింగ్ చేయనున్నారు. శ్రీలంక స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ, మహీశా పతీరణ జట్టుతో కలిసారు. మహీశ్ తీక్షణ రాజస్థాన్ రాయల్స్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. చెన్నైలోని చెపాక్ మైదానం స్పిన్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో అతనికి ప్రాధాన్యత లభించనుంది.

గత మ్యాచ్‌లో అనూహ్యంగా అవకాశం అందుకొని ఆకాశమే హద్దుగా చెలరేగిన టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే జట్టులో కొనసాగనున్నాడు. అతను మూడో స్థానంలో బరిలోకి దిగనుండగా.. ఓపెనర్లుగా డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగనున్నారు. ఈ ముగ్గురు సూపర్ ఫామ్‌లో ఉండటం చెన్నైకి కలిసొచ్చే అంశం.

నాలుగో స్థానంలో మొయిన్ అలీ ఆడనుండగా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఐదో స్థానంలో అంబటి రాయుడు బ్యాటింగ్ చేయవచ్చు. రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ ఫినిషర్ పాత్ర పోషించనున్నారు. మిచెల్ సాంట్నర్, మహీశ్ తీక్షణ స్పిన్ బాధ్యతలు పంచుకోనుండగా.. రాజవర్దనే హంగార్గేకర్, తుషార్ దేశ్ పాండే పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. మూడో పేసర్‌గా సిసండా మగలా ఆడే అవకాశం ఉంది. అతను జట్టులోకి వస్తే శివమ్ దూబే బెంచ్‌కే పరిమితమవుతాడు.

సీఎస్‌కే తుది జట్టు(అంచనా)

డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, మిచెల్ సాంట్నర్, మహీశ్ తీక్షణ, రాజవర్దనే హంగార్గేకర్, సిసండా మగలా

ఇంపాక్ట్ ప్లేయర్: తుషార్ దేశ్ పాండే

Story first published: Tuesday, April 11, 2023, 19:00 [IST]
Other articles published on Apr 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+