ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. కీలక పోరు సిద్దమైంది. చెన్నై వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడం చెన్నై సూపర్ కింగ్స్‌కు కీలకం.
ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే 6 మ్యాచ్‌లు గెలిచి పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఎలాంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోవాలంటే చివరి రెండు మ్యాచ్‌లు గెలవడం చాలా కీలకం. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్‌తో ఈ మ్యాచ్ డూ ఆడ్ డైగా మారింది. గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ పరాజయం చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చింది. ఈ ఓటమి నుంచి తేరుకోని ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోంది. ఈ క్రమంలోనే విన్నింగ్ కాంబినేషన్‌పై చెన్నై మేనేజ్‌మెంట్ ఫోకస్ పెట్టింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీష పతీరణ, దీపక్ చాహర్‌లు జట్టుకు దూరమవడంతో ఆ జట్టు పేస్ బౌలింగ్ బలహీనంగా మారింది.
ఈ క్రమంలోనే ఓవర్‌సీస్ పేసర్‌గా రిచర్డ్ గ్లీసన్‌ను తీసుకోనుంది. అదే జరిగితే గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన రచిన్ రవీంద్రపై వేటు పడనుంది. ఫారిన్ పేసర్ అక్కర్లేదనుకుంటే గత మ్యాచ్ కాంబినేషన్‌నే కొనసాగించనున్నారు.
ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే కొనసాగనుండగా.. మిడిలార్డర్‌లో డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, మొయిన్ అలీ ఆడనున్నారు. మిచెల్ సాంట్నర్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా బరిలోకి దిగనున్నాడు. యువ పేసర్ సిమర్జీత్ సింగ్‌ను కూడా తుది జట్టులో కొనసాగించే అవకాశం ఉంది.
అయితే అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించనున్నారు. శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, రిచర్డ్ గ్లీసన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. రవీంద్ర జడేజా, ధోనీ ఫినిషర్లుగా ఆడనున్నారు. చెన్నై పిచ్ పూర్తిగా స్పిన్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో సాంట్నర్, మోయిన్ అలీ, జడేజా కీలకం కానున్నారు. అజింక్యా రహానే, తుషార్ దేశ్‌పాండేలను ఇంపాక్ట్ ప్లేయర్లు ఆడించే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్‌తో సీఎస్‌కే తుది జట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, మహేంద్ర సింగ్ ధోనీ, సిమర్జీత్ సింగ్ , రిచర్డ్ గ్లీసన్/రచిన్ రవీంద్ర
ఇంపాక్ట్ ప్లేయర్:తుషార్ దేశ్‌పాండే