Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK Playing XI: అతనికి మళ్లీ నిరాశే.. గుజరాత్ టైటాన్స్‌తో ఆడే చెన్నై తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2024 సీజన్‌‌ను విజయంతో ప్రారంభించిన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. సొంతమైదానం వేదికగా మంగళవారం జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో సీఎస్‌కే అమీతుమీ తేల్చుకోనుంది.

మహేంద్ర సింగ్ ధోనీ తన సారథ్య బాధ్యతలను యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ధోనీ గైడెన్స్‌లో కెప్టెన్‌గా ఆర్‌సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ విజయాన్ని అందుకున్నాడు.

CSK Playing XI vs GT IPL 2024 Tushar Deshpande Continues as No Chance For Shardul Thakur

తొలి మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో చెలరేగిన చెన్నై సూపర్ కింగ్స్.. 6 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని సీఎస్‌కే భావిస్తోంది. అయితే విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చేందుకు చెన్నై సూపర్ కింగ్స్ పెద్దగా ఇష్టపడదు. కానీ ఆ జట్టు యువ పేసర్ తుషార్ దేశ్‌పాండే తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు.

4 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చాడు. అయితే అతనికి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. దాంతో శార్దూల్ ఠాకూర్‌కు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది. ఒకవేళ అతన్ని తప్పిస్తే జట్టులోకి శార్దూల్‌తో పాటు మరో యువ పేసర్‌కు ఛాన్స్ దక్కవచ్చు. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర కొనసాగనుండగా.. మిడిలార్డర్‌లో అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా ఆడనున్నారు.

యువ ప్లేయర్ సమీర్ రిజ్వీతో పాటు మహేంద్ర సింగ్ ధోనీ ఫినిషర్ పాత్ర పోషించనున్నారు. శివమ్ దూబే ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. పేసర్లుగా దీపక్ చాహర్‌తో పాటు తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆడనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా మహీష్ తీక్షణ ఆడనున్నాడు.

గాయం నుంచి కోలుకున్న మతీష పతీరణ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. కానీ అతనికి మరో రెండు మ్యాచ్‌ల వరకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్.. తొలి మ్యాచ్‌లో పటిష్ట ముంబై ఇండియన్స్ ఓడించి మంచి జోష్ మీద ఉంది. దాంతో ఈ మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గుజరాత్ టైటాన్స్‌తో సీఎస్‌కే తుది జట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, మహేంద్ర సింగ్ ధోనీ, దీపక్ చాహర్, మహీష్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తుషార్ దేశ్‌పాండే.

Story first published: Monday, March 25, 2024, 17:04 [IST]
Other articles published on Mar 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+