Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK Playing XI vs DC: బెంచ్‌కే బెన్‌స్టోక్స్.. ఢిల్లీతో ఆడే చెన్నై జట్టు ఇదే!

లక్నో: ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరువగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం చెపాక్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ధోనీసేన అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా రెండు పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్‌పై అద్భుత విజయాన్నందుకున్న చెన్నై.. 6 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది.

ప్లే ఆఫ్స్ చేరాలంటే చెన్నై చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలవాలి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎలాగైనా ఓడించాలని ఆ జట్టు భావిస్తోంది. మరోవైపు వరుస పరాజయాల తర్వాత పుంజుకున్న ఢిల్లీ 4 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే అంటే ఆ జట్టు ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 benstroke-

ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే చెన్నై సూపర్ కింగ్స్ కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొకాలి గాయంతో జట్టుకు దూరమైన బెన్ స్టోక్స్ ఫిట్ అయినట్లు తెలుస్తోంది. స్టోక్స్ నెట్ ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే బెన్ స్టోక్స్ జట్టులోకి తీసుకుంటే ఎవర్నీ పక్కనపెట్టాలనేది సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది.

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌ కోచ్ మైక్ హస్సీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే బెన్ స్టోక్స్ ఫిట్ అయినా అతను బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తుది జట్టులో ఆడుతున్న మోయిన్ అలీ, మతీష పతీరణ, మహీశ్ తీక్షణ/మిచెల్ సాంట్నర్‌లు అద్భుతంగా రాణిస్తుండటంతో బెన్ స్టోక్స్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం లేదు.

చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండటంతో సీఎస్‌కే ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అంబటి రాయుడు, తుషార్ దేశ్‌పాండే బరిలోకి దిగనున్నారు. ముందుగా బౌలింగ్ చేస్తే తుషార్ దేశ్‌పాండే, బ్యాటింగ్ చేస్తే అంబటి రాయుడు బరిలోకి దిగనున్నారు.

సీఎస్‌కే తుది జట్టు(అంచనా)

డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ ధూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, మహీశ్ పతీరణ

ఇంపాక్ట్ ప్లేయర్: తుషార్ దేశ్‌పాండే

Story first published: Tuesday, May 9, 2023, 19:03 [IST]
Other articles published on May 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+