Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: స్పిన్ టు విన్.. చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) తెలివిగా వ్యవహరించింది. ఫ్యాన్సీ ఆటగాళ్ల జోలి పోకుండా.. కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టకుండా తమకు కావాల్సిన ఆటగాళ్లను అతి తక్కువ ధరకు ఆచితూచి కొనుగోలు చేసింది. టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మార్క్ సెలెక్షన్ వేలంలో ప్రతిబింబించింది.

మరోసారి అనుభవానికే పెద్ద పీట వేస్తూ.. సీనియర్ ఆటగాళ్లనే జట్టులోకి తీసుకుంది. అంతేకాకుండా జట్టు భవిష్యత్తు కోసం అనామక ఆటగాళ్లపై కూడా ఖర్చు పెట్టింది. తెలుగు తేజం షేక్ రషీద్‌తో పాటు అనేక మంది కుర్రాళ్లను తీసుకుంది.

CSK Playing XI For IPL 2025 Spin to win for Chennai Super Kings at Chepauk in Ashwin-Noor-Jadeja trio

స్పిన్ టూ విన్..
వేలానికి ముందే తమ ప్రధాన ఆటగాళ్లను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు మతీష పతీరణ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీలను అంటిపెట్టుకుంది. తమ పాత ఆటగాళ్లు అయిన డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్రలను తక్కువ ధరకే తిరిగి కొనుగోలు చేసింది.

చెన్నైలోని చెపాక్ మైదానానికి అనుగుణంగా జట్టును నిర్మించింది. స్పిన్‌కు పెద్ద పీట వేస్తూ.. ఆటగాళ్లను తీసుకుంది. రవిచంద్రన్ అశ్విన్.. నూర్ అహ్మద్‌లను భారీ ధరకు కొనుగోలు చేసి స్పిన్ విభాగాన్ని పటిష్టం చేసింది. టర్నింగ్ ట్రాక్‌పై ప్రత్యర్థులను స్పిన్‌తో దెబ్బతీయాలనే వ్యూహంతో ఈ ఇద్దరిని తీసుకుంది.

అశ్విన్ కోసం రూ.9.75 కోట్లు ఖర్చు చేసిన్.. సీఎస్‌కే మరో అఫ్గాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్‌ కోసం ఏకంగా రూ. 10 కోట్లు వెచ్చింది. ఈ ఇద్దరికి రవీంద్ర జడేజా తోడవనున్నాడు. చెన్నై వికెట్‌పై ఈ స్పిన్ త్రయాన్ని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు సవాలే. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరణ్‌‌ను తక్కువ ధరకే దక్కించుకుంది. భారత పేసర్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరీలను కొనుగోలు చేసింది. బ్యాటర్లలో వెటరన్ ప్లేయర్ దీపక్ హుడాను కొనుగోలు చేసింది. వేలంలో మొత్తం 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి 25 మందితో జట్టును భర్తీ చేసింది.

టీమ్ కాంబినేషన్..
కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు డేవాన్ కాన్వే ఓపెనింగ్ చేయనుండగా.. స్పిన్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర ఫస్ట్ డౌన్‌లో ఆడనున్నాడు. నాలుగో స్థానంలో రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్ చేయనుండగా.. ఐదో స్థానంలో శివమ్ దూబే, ఆరో స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ ఆడనున్నారు. రవీంద్ర జడేజా ఏడో స్థానంలో, అశ్విన్ 8వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. సామ్ కరణ్, ఖలీల్ అహ్మద్, మతీష పతీరణ పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యత ఇచ్చిన సీఎస్‌కే.. పటిష్టమైన జట్టును తయారు చేసుకుంది.

సీఎస్‌కే వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

డేవన్ కాన్వే(రూ. 6.25 కోట్లు), రాహుల్ త్రిపాఠి(రూ. 3.4 కోట్లు), రచిన్ రవీంద్ర(రూ. 4 కోట్లు), రవిచంద్రన్ అశ్విన్(రూ. 9.75 కోట్లు), ఖలీల్ అహ్మద్(రూ. 4.80 కోట్లు), నూర్ అహ్మద్(రూ. 10 కోట్లు), విజయ్ శంకర్(రూ. 1.2 కోట్లు), సామ్ కరణ్(రూ. 2.4 కోట్లు), షేక్ రషీద్(రూ. 30 లక్షలు), అన్షుల్ కంబోజ్(రూ. 3.4 కోట్లు), ముఖేష్ చౌదరి(రూ. 30 లక్షలు), దీపక్ హు డా(రూ. 1.7 కోట్లు), గుర్జప్‌నీత్ సింగ్(రూ. 2.2 కోట్లు), నాథన్ ఎల్లిస్(రూ. 2 కోట్లు), జామీ ఓవర్టన్(రూ. 1.5 కోట్లు), కమలేష్ నాగర్‌కోటీ(రూ. 30 లక్షలు), రామకృష్ణ ఘోష్(రూ. 30 లక్షలు), శ్రేయస్ గోపాల్(రూ. 30 లక్షలు), వాన్షి బేడీ(రూ. 55 లక్షలు), ఆండ్రే సిద్దార్థ్(రూ. 30 లక్షలు)

సీఎస్‌కే రిటైన్ లిస్ట్:
రుతురాజ్ గైక్వాడ్(రూ. 18 కోట్లు), మతీష పతీరణ(రూ. 13 కోట్లు), శివమ్ దూబే(రూ. 12 కోట్లు), రవీంద్ర జడేజా(రూ. 18 కోట్లు), మహేంద్ర సింగ్ ధోనీ(రూ. 4 కోట్లు)

సీఎస్‌కే తుది జట్టు(అంచనా): రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, మహేంద్ర సింగ్ ధోనీ(కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, సామ్ కరణ్, ఖలీల్ అహ్మద్, మతీష పతీరణ.

Story first published: Thursday, November 28, 2024, 20:37 [IST]
Other articles published on Nov 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+