Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK Palying XI: ఆ ఇద్దరిపై వేటు.. ముంబై ఇండియన్స్‌తో తలపడే సీఎస్‌కే తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2024 సీజన్‌లో మళ్లీ విజయాల బాట పట్టిన చెన్నై సూపర్ కింగ్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. వాంఖడే వేదికగా ఆదివారం జరగనున్నరెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిళ్లు గెలిచిన ఈ రెండు జట్ల మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

ఐపీఎల్-2024 లీగ్ దశలో ముంబై, చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కసారి మాత్రమే తలపడనున్నాయి. దాంతో ఈ మ్యాచ్ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన చెన్నై మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి, ఏడో స్థానంలో నిలిచింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత ముంబై తిరిగి గెలుపు బాట పట్టింది.

CSK Palying XI vs MI For IPL 2024 Shardul Thakur Out and 3 Players IN

ఈ క్రమంలోనే ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తినెలకొంది. సొంతగడ్డపై విజయాలు సాధిస్తున్న చెన్నై.. ఇతర మైదానాల్లో మాత్రం తెలిపోతుంది. ముంబై గడ్డపై విజయం సాధించి జైత్రయాత్ర కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే టీమ్ కాంబినేషన్‌పై ఫోకస్ పెట్టింది. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు చేయకున్నా.. బౌలింగ్‌ యూనిట్‌లో మార్పులు చేసే ఛాన్స్ ఉంది.

పాపం శార్దూల్ ఠాకూర్.
ఫిట్‌నెస్ సమస్యలతో గత మ్యాచ్‌కు దూరమైన దీపక్ చాహర్‌, మతీష్ పతీరణ.. ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే శార్దూల్ ఠాకూర్‌పై వేటు పడనుంది. జూనియల్ మలింగా మతీష పతీరణ కూడా అందుబాటులోకి వస్తే మహీశ్ తీక్షణను పక్కనపెట్టనున్నారు. శివమ్ దూబేను ప్రధాన జట్టులోకి తీసుకొని యువ ప్లేయర్ సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో చేర్చే అవకాశం ఉంది.

సమీర్ రిజ్వీతో పాటు శార్దూల్ ఠాకూర్, ముఖేష్ చౌదరి ఈ జాబితాలో ఉండనున్నారు. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, రచీన్ రవీంద్ర బరిలోకి దిగనుండగా.. మిడిలార్డర్‌లో అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే ఆడనున్నారు. ఫినిషర్లుగా జడేజాతో పాటు మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహరించనున్నాడు.

ముఖా ముఖి:
ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు ముంబై, చెన్నై 36 సార్లు తలపడ్డాయి. ముంబై ఇండియన్స్ 20 మ్యాచ్‌ల్లో నెగ్గగా, సీఎస్కే 16 మ్యాచ్‌ల్లో గెలిచింది. అయితే 2022 నుంచి చెన్నైదే పైచేయి. గత రెండు సీజన్లలో ఇరు జట్ల మధ్య జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో చెన్నై మూడింట్లో విజయం సాధించింది.

సీఎస్‌కే తుది జట్టు(అంచనా):
రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే/సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, శార్దూల్ ఠాకూర్/దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ/ మతీష పతీరణ

ఇంపాక్ట్ ప్లేయర్లు: శివమ్ దూబే, సమీర్ రిజ్వీ, శార్దూల్ ఠాకూర్, ముఖేష్ చౌదరి

Story first published: Saturday, April 13, 2024, 18:08 [IST]
Other articles published on Apr 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+