Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్‌లోకి సంజూ శాంసన్!

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ మరో జట్టులోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే తనను రిలీజ్ చేయాలని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యాన్ని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా.. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా.. ఎక్కువ మ్యాచ్‌ల్లో జట్టును నడిపించిన సారథిగా సంజూ శాంసన్ రికార్డ్ సాధించాడు.

రాజస్థాన్ రాయల్స్ తరఫున సుదీర్ఘ కాలం ఆడిన సంజూ శాంసన్.. భారీ ఆఫర్ రావడంతోనే ఆ జట్టును వీడేందుకు సిద్దమయ్యాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సంజూ శాంసన్.. అమెరికాలో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌తో పాటు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను కలిసినట్లు కూడా ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది.

CSK Eye Sanju Samson in IPL 2026 Rajasthan Royals Reportedly Demand Two Players

క్యాష్ డీల్ ట్రేడింగ్ ద్వారా సంజూ శాంసన్ తమ జట్టులోకి తెచ్చుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సంజూ శాంసన్‌ను వదులుకోవాలంటే ఇద్దరు ఆటగాళ్లను ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కూడా సంజూ శాంసన్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. కానీ సంజూ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ధోనీకి సరైన వారసుడిగా సంజూ శాంసన్ సరైనవాడని సీఎస్‌కే భావిస్తోంది. సంజూను తీసుకోవడం వల్ల జట్టుకు కెప్టెన్‌తో పాటు వికెట్ కీపర్ దొరుకుతాడనే యోచనలో ఆ ఫ్రాంచైజీ ఉంది. అయితే సంజూ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కోరుతున్న ఇద్దరు ఆటగాళ్లు ఎవరు? అనేది మాత్రం తెలియరాలేదు. ట్రేడింగ్ డీల్ కుదరకపోతే.. సంజూ శాంసన్ వేలంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Story first published: Friday, August 8, 2025, 16:49 [IST]
Other articles published on Aug 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+