Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాకు ఈ రోజే చెప్పాడయ్యా: CSK సీఈఓ

ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను నియమించింది. ఐదు టైటిళ్లతో జట్టును దిగ్విజయంగా నడిపించిన మహేంద్ర సింగ్ ధోనీ.. తన సారథ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడని ప్రకటించింది. అయితే ఈ కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ధోనీ ఈ రోజే చెప్పాడని తెలిపాడు. ఐపీఎల్ ట్రోఫీ ఫొటో షూట్‌కు ముందు ఈ విషయాన్ని తమకు తెలియజేశాడని పేర్కొన్నాడు. ధోనీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటాడని తాను ఊహించలేదన్నాడు. ఓ ప్రముఖ న్యూస్ ఎజెన్సీతో మాట్లాడిన ఆయన.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

CSK CEO Reveals Got to Know Of The Captaincy Handover Decision of MS Dhoni Just Before The photoshoot

'ధోనీ ఏం చేసినా జట్టు ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొనే చేస్తాడు. ఐపీఎల్ కెప్టెన్ల సమావేశం ముందే అతని నిర్ణయం నాకు తెలిసింది. అతని నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉంది. అది అతని నిర్ణయం. రెండేళ్ల క్రితం జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పుతూ మేం చేసిన ప్రయోగం వర్కౌట్ కాలేదు. కానీ ఈ సారి సక్సెస్ అవుతుంది.'అని చెప్పుకొచ్చాడు.

ధోనీ ఏ నిర్ణయాన్ని అయినా ఆకస్మికంగా ప్రకటిస్తాడు. టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగడం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పడం వంటి నిర్ణయాలన్నీ ఆకస్మాత్తుగానే తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా సీఎస్‌కే సారథ్యాన్ని కూడా తనదైన శైలిలోనే వదులుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

తాజా నిర్ణయంతో ధోనీ ఈ సీజన్‌లో పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతాడా? లేక ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతాడా? లేకుంటే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్‌గా కొనసాగుతాడా? అనేది తెలియాల్సి ఉంది. ఐపీఎల్ 2022 మెగా వేలం అనంతరం చెన్నై సూపర్ కింగ్స్.. తమ కెప్టెన్‌గా జడేజాను నియమించింది.

అయితే కెప్టెన్సీ ఒత్తిడిని జడేజా తట్టుకోలేకపోయాడు. అతని సారథ్యంలో చెన్నై దారుణ ప్రదర్శన చేసింది. వరుస పరాజయాలతో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. దాంతో సీజన్ మధ్యలోనే జడేజాను తప్పించి ధోనీ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. అనంతరం జడేజా గాయం పేరిట టోర్నీ నుంచి తప్పుకున్నాడు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో ధోనీ సారథ్యంలో ఆడిన జడేజా మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఫైనల్లో ఒంటిచేత్తో చెన్నైని గెలిపించాడు.

Story first published: Thursday, March 21, 2024, 19:10 [IST]
Other articles published on Mar 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+