Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరో పదేళ్లలో చెన్నై సూపర్ కింగ్స్ బాస్ ధోనీనే!

CSK CEO makes huge statement about Dhoni’s possible role at franchise in future

చెన్నై: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో పదేళ్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అధినేతగా ఎదుగుతాడని ఆ జట్టు సీఈవో విశ్వనాథన్‌ జోస్యం చెప్పాడు. మంగళవారం మహీ 39వ పుట్టినరోజు సందర్భంగా స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఓటమి అనంతరం ధోనీ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2020 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్ వరకు అతను మళ్లీ బ్యాట్ పట్టలేదు. ఇక ఐపీఎల్‌లో పాల్గొని మహీ సత్తా చాటుతాడని ఆశించినా కరోనా వైరస్‌ కారణంగా ఆ మెగా టోర్నీ వాయిదా పడింది.

నమ్మశక్యం కానీ రీతిలో..

నమ్మశక్యం కానీ రీతిలో..

అయితే, మార్చిలో చెన్నైలో నిర్వహించిన సీఎస్‌కే శిక్షణా శిబిరంలో మహీ నమ్మశక్యం కాని రీతీలో ప్రాక్టీస్ చేశాడని విశ్వనాథన్ గుర్తుచేసుకున్నాడు.'ఇప్పటి నుంచీ మరో పదేళ్లలో ధోనీ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు అధినేతగా మారిపోతాడు. అలాగే మార్చిలో నిర్వహించిన సీఎస్కే శిక్షణా శిబిరంలో చాలా కష్టపడ్డాడు. ఈ సీజన్‌లో చాలా బాగా ఆడాలని నిర్ణయించుకున్నాడు. అతనో అత్యుత్తమ ఆటగాడు. ఎప్పటికీ అలాగే ఉంటాడు' అని ఆ సీఈవో పేర్కొన్నాడు.

తాలా పేరు ఎలా వచ్చిందంటే..

తాలా పేరు ఎలా వచ్చిందంటే..

అలాగే ధోనీకి తాలా అనే పేరు ఎందుకు పెట్టారో కూడా ఆయన వివరించాడు. 'జట్టులో ప్రతీ ఒక్కరి నుంచీ అత్యుత్తమ ప్రదర్శన రాబట్టగల సామర్థ్యం ధోనీలో ఉందని నాకు తెలుసు. ఏ ఆటగాడి నుంచైనా తనకు కావాల్సింది రాబట్టుకోగలడు. అందుకే మేం అతడిని తాలా అని పిలవాలనుకున్నాం' అని ఆయన చెప్పారు.

వరుసగా నాలుగు టోర్నీలు

వరుసగా నాలుగు టోర్నీలు

2012,13,14,15 సీజన్లలో చెన్నై వరుసగా టైటిల్ అందుకోలేకపోయిందన్న విశ్వనాథన్.. అలాంటి సమయంలో ధోనీ ఆటగాళ్ల వద్దకెళ్లి మాట్లాడాడని గుర్తు చేసుకున్నాడు. 'మన ఆటపై మనకు నమ్మకం కలిగి ఉంటే ఏదైనా సాధించగలం. నా జీవితంలో ఎన్నోసార్లు దీన్ని పాటించాను. నిజమైంది..' అని వారిలో స్ఫూర్తి కలిగించాడు' అని విశ్వనాథన్‌ స్పష్టం చేశాడు.

మూడు టైటిళ్లు..

మూడు టైటిళ్లు..

ఇక ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే ఐపీఎల్‌తో అత్యంత సక్సెస్‌ఫుల్ టీమ్. మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆ జట్టు.. ఐదు సార్లు ఫైనల్లో ఓడటం గమనార్హం. ఇక నిషేధం ఎదుర్కొన్న సీజన్లు మినహా.. ప్రతీసీజన్‌లో సీఎస్‌కే ప్లే ఆఫ్ చేరింది. ఇందులో 2009లో సెమీఫైనలిస్ట్.. 2014లో ప్లే ఆఫ్స్ మినహా అన్ని సీజన్లలో ఫైనల్ మ్యాచ్ ఆడింది.

Story first published: Tuesday, July 7, 2020, 22:27 [IST]
Other articles published on Jul 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+