Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నైలోనే ధోనీ ఆఖరి మ్యాచ్: సీఎస్‌కే సీఈఓ

టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ భవితవ్యంపై చెన్నై సూపర్ కింగ్స్‌(సీఎస్‌కే) సీఈవో కాశీ విశ్వనాథన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నైలోనే ధోనీ ఆఖరి మ్యాచ్ ఆడుతాడని స్పష్టం చేశాడు. ఇక రిటైర్మెంట్ ఊహాగానాలకు తెరదించుతూ ధోనీ.. సీఎస్‌కే తరఫున ఐపీఎల్ 2025 సీజన్ ఆడేందుకు సిద్దమయ్యాడు.

అనామక ప్లేయర్‌గా ధోనీని రూ. 4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ధోనీ ఆడుతున్నాడనే విషయం చెన్నై అభిమానులకు రెట్టించిన సంతోషాన్నిచ్చింది. అయితే ధోనీకి ఇదే చివరి సీజన్ కానుందా? అనే విషయంపై స్పష్టత లేదు. తాజాగా కాశీ విశ్వనాథన్.. ధోనీ భవితవ్యంపై స్పందించాడు.

CSK CEO Kasi Viswanathan says MS Dhoni will play his last game in Chennai ahead of IPL 2025

చెన్నైలోనే చివరి మ్యాచ్..
చెన్నైలోనే ఆఖరి మ్యాచ్ ఆడాలనేది ధోనీ కోరికని, అతను ఆడేంతవరకు సీఎస్‌కే డోర్స్ తెరిచే ఉంటాయని కాశీవిశ్వనాథన్ స్పష్టం చేశాడు. 'ధోనీ భాయ్ ప్రతీది తనలోనే ఉంచుకుంటాడు. తన మనసులోని మాటను చివరి నిమిషంలోనే చెబుతాడు. సీఎస్‌కే అంటే అతనికి ఎంత ఇష్టమో చాలా సందర్భాల్లో చెప్పాడు.

ఓ ఇంటర్వ్యూలో ధోనీ మాట్లాడుతూ.. తన చివరి మ్యాచ్‌ను చెన్నైలోనే ఆడుతానని తెలిపాడు. తాను ఆడేంత వరకు చెన్నై జట్టులోనే కొనసాగుతాడని మేం ఆశిస్తున్నాం. అతని కోసం ఎప్పుడూ చెన్నై సూపర్ కింగ్స్ డోర్లు తెరిచే ఉంటాయి. ఆట పట్ల అతనికి ఉన్న నిబద్దత, అంకిత భావం మాకు తెలుసు. అతను ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటాడు.'అని అంబటి రాయుడితో ఓ ఛానెల్‌లో జరిపిన చర్చలో కాశీ విశ్వనాథన్ తెలిపాడు.

ధోనీ కోసం పాత రూల్..
ధోనీని రిటైన్ చేసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ పట్టుబట్టి ఓ పాత రూల్‌ను మళ్లీ తీసుకొచ్చింది. ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌‌కు దూరమవ్వడంతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లేని ఆటగాళ్లను అనామక ప్లేయర్లుగా పరిగణించాలనే పాత రూల్‌ను మళ్లీ ప్రవేశ పెట్టారు. ధోనీ కోసమే ఈ రూల్‌ను తీసుకొచ్చాడు.

2018 మెగా వేలం వరకు ఈ రూల్ అమల్లో ఉండగా.. 2022 మెగా వేలంలో తొలగించారు. ఇప్పుడు మళ్లీ ప్రవేశపెట్టారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ.. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. వచ్చే సీజన్ ప్రారంభమయ్యే సమయానికి ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఐదేళ్లు పూర్తవుతోంది.

రూ. 55 కోట్లతో వేలానికి..
ధోనీతో పాటు రుతురాజ్ గైక్వాడ్(రూ. 18 కోట్లు), రవీంద్ర జడేజా(రూ. 18 కోట్లు), మతీష పతీరణ(రూ. 13 కోట్లు), శివమ్ దూబే(రూ. 12 కోట్లు)లను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. ఈ ఐదుగురి కోసం రూ. 65 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్టు పర్స్‌లో ఇంకా రూ. 55 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బుతోనే మెగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. ఐదుగురిని మాత్రమే రిటైన్ చేసుకోవడంతో ఆ జట్టుకు ఓ ఆర్‌టీఎమ్ కార్డ్ ఉంది.

Story first published: Monday, November 11, 2024, 18:43 [IST]
Other articles published on Nov 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+