Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ రెండు ఓవర్లే మా కొంపముంచాయి: రుతురాజ్ గైక్వాడ్

మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని చెన్నై సూపర్ కింగ్స్(CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ముఖ్యంగా 11, 12వ ఓవర్లలో 4 పరుగులే చేయడం తమ పతనాన్ని శాసించిందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)పై గెలుపొందింది.

195 పరుగుల లక్ష్యఛేదనలో 10 ఓవర్లలో 113 పరుగులు చేసిన సీఎస్‌కే సునాయసంగా గెలిచేలా కనిపించింది. కానీ ఎషాన్ మలింగా 11వ ఓవర్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఔట్ చేయడంతో పాటు ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. 12వ ఓవర్ వేసిన శివాంగ్ కుమార్ కూడా డెవాల్డ్ బ్రెవిస్(0)ను ఔట్ చేయడంతో పాటు మూడు పరుగులే ఇచ్చాడు. దాంతో ఈ 2 ఓవర్లలో సీఎస్‌కే కేవలం 4 పరుగులే చేసి మూల్యం చెల్లించుకుంది.

మా బౌలింగ్ అద్భుతం..

మ్యాచ్ అనంతరం మాట్లాడిన రుతురాజ్ గైక్వాడ్.. ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. 'ఇది సునాయసంగా ఛేదించాల్సిన లక్ష్యం. అయితే పవర్ ప్లేలో మా బౌలింగ్ చూసి సన్‌రైజర్స్ హైదరాబాద్ సునాయసంగా 220-230 పరుగులు చేస్తుందని అనుకున్నా. కానీ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి 30 పరుగులు తక్కువే ఇచ్చారు. ఇలాంటి మైదానంలో 200 పరుగుల లక్ష్యం ఛేదించడం కష్టం కాదు.

CSK Captain Ruturaj Gaikwad Points to Mid-Innings Slowdown for Narrow Defeat Against SRH in IPL 2026
Photo Credit: screen grab for JioHotstar

ఒక దశలో మా విజయానికి 10 ఓవర్లలో 80 పరుగులే అవసరమయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో మేం భాగస్వామ్యాలు నెలకొల్పాల్సింది. తద్వారా ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తేవాల్సింది. కానీ ఆ తర్వాతి రెండు ఓవర్లు మ్యాచ్ గమనాన్ని మార్చేసాయి. 11, 12వ ఓవర్ల‌లో మేం కేవలం 4 పరుగులు మాత్రమే చేశాం. ఇది మా ఓటమిని శాసించింది. డెత్ ఓవర్లలో ఓవర్‌కు 12, 13 పరుగులు చేయడం కష్టమని మాకు తెలుసు. ఆఖర్లో సన్‌రైజర్స్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ గెలుపు క్రెడిట్ వారికే దక్కుతుంది.

అన్షుల్ కష్టపడుతున్నాడు..

గత మూడు మ్యాచ్‌లుగా మేం బౌలింగ్‌లో బాగా రాణిస్తున్నాం. ఈరోజు కూడా పవర్‌ప్లే తర్వాత ప్రతి ఒక్క బౌలర్ బాధ్యత తీసుకున్నారు. పవర్‌ప్లేలో అభిషేక్ అద్భుతంగా ఆడాడు. మా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మేం లూజ్ డెలివరీలు ఏం వేయలేదు. అతను నాణ్యమైన క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత మాకు ముమెంటం దొరికినప్పుడు దాన్ని బాగా వాడుకున్నాం. జేమీ ఓవర్టన్, గుర్జాపనీత్ సింగ్, నూర్ అహ్మద్, చివర్లో అన్షుల్ కంబోజ్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేశారు.

అన్షుల్ కంబోజ్ తన బౌలింగ్‌పై, ముఖ్యంగా డెత్ బౌలింగ్‌పై చాలా కష్టపడుతున్నాడు. 'నాకు ఏం చేయాలో తెలుసు, ఇవే నా ప్లాన్స్' అని కెప్టెన్‌కు స్పష్టంగా చెప్పే బౌలర్లు దొరకడం చాలా అరుదు. అతను మా జట్టులో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. అతను రోజురోజుకూ మెరుగుపడుతున్నాడు.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, April 19, 2026, 0:31 [IST]
Other articles published on Apr 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+