MS Dhoni సిక్స్‌కు గూగుల్ గుర్తింపు.. ఆనందంలో ఫ్యాన్స్!!

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'కెప్టెన్ కూల్'గా జట్టును ముందుండి నడిపించే అతడి నాయకత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం కెప్టెన్సీలోనే కాగా తన బ్యాటింగ్‌తోనూ మెరుపులు మెరిపిస్తూ ఎందరో అభిమానులను అలరించాడు. అందుకే అభిమానులు 'ధనదన్' ధోనీ అని పిలుస్తుంటారు.
అయితే గతేడాది ఎవరూ ఊహించని రీతిలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రమే మహీ ఆడుతున్నాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలోనే వాయిదా పడడంతో ధోనీ ఇంటికివెళ్లిపోయాడు.

స్టేడియం బయటకు
గతేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యూఏఈలో అభిమానుల్లేకుండానే ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. అయినా కూడా ఐపీఎల్ 2020 కావాల్సినంత వినోదాన్ని పంచింది. అందులో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ.. స్టేడియం బయటకు కొట్టిన ఓ సిక్స్ అయితే ఇప్పటికీ అభిమానులకు గుర్తుంది. ఇప్పుడు ఆ సిక్స్‌కు గూగుల్ గుర్తింపు లభించింది. దీంతో మహీ ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ధోనీ ఐపీఎల్ 2008 నుంచి చెన్నై జట్టుకే ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 211 మ్యాచులు ఆడి 4669 రన్స్ చేశాడు.

గూగుల్ గుర్తింపు
ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ చివరలో ఎంఎస్ ధోనీ వరుస సిక్సర్లు కొట్టాడు. అందులో ఓ సిక్స్ స్టేడియం బయట రోడ్డుపై పడింది. ఆ బంతిని ఓ అభిమాని తీసుకుని వెళ్లిపోయాడు. ఇది అక్కడి కెమెరాల్లో రికార్డు అయింది. ఆ బంతి పడిన చోటును గూగుల్ మ్యాప్‌లో 'ధోనీస్ సిక్స్'గా అభిమానులు పేరు పెట్టారు. దానికి తాజాగా గూగుల్ నుంచి ధ్రువీకరణ వచ్చింది. దీనికి సంబందించిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ధోనీ ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
WTC Final 2021 జట్టుని ప్రకటించిన వెంకటేష్.. ఇద్దరు తెలుగు ఆటగాళ్లకు షాక్!!

సెప్టెంబర్ 19న ఐపీఎల్ స్టార్ట్
కరోనా కారణంగా ఐపీఎల్ 2021 నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే 29 మ్యాచ్‌లు పూర్తయిన ఐపీఎల్ 2021లో మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. దీనికోసం కనీసం 25 రోజుల సమయం దొరికినా చాలు.. టోర్నీని పూర్తి చేస్తామని బీసీసీఐ ముందునుంచి చెబుతూ వస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో ఎలాగూ సాధ్యం కాదని భావించి టోర్నీని యూఏఈకి తరలించారు. యూఏఈలో సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2021 తిరిగి ప్రారంభం కానుంది. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరుగుతుంది.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై:
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గతేడాది ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ 90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10773 రన్స్ చేశాడు. వీటిల్లో 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1600 పరుగుల బాదాడు. ఐపీఎల్ టోర్నీలో 211 మ్యాచులు ఆడి 4669 రన్స్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications