Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni: సరికొత్త లుక్‌లో మహీ.. కుర్రాళ్లు ఫిదా! వేరే లెవ‌ల్ హీరో ధోనీ!!

CSK captain MS Dhonis new hairstyle goes viral

రాంచి: భారత క్రికెటర్లలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీది ప్రత్యేక స్టయిల్. క్రికెట్‌ కెరీర్‌ ఆరంభించిన తొలినాళ్లలో పొడవాటి జుట్టుతో అందరిని ఆకట్టుకున్నాడు. మూడేళ్ల పాటు అదే స్టయిల్ మెయింటైన్ చేశాడు. అప్పుడు యువత 'ధోనీ స్టైల్‌' కావాలంటూ హెయిర్‌ సెలూన్లకు పరుగులు పెట్టారు. 2007 టీ20 ప్రపంచకప్ అనంతరం జుట్టు కత్తిరించాడు. ఆపై ఎన్నో హెయిర్‌ స్టైల్‌లలో మెరిశాడు. వాటన్నింటిని మహీ కొత్తగానే ఉండేలా చూసుకున్నాడు. అందుకే ఫాన్స్ అందరూ మహీని ఎప్పుడూ ఫాలో అవుతుంటారు. ఇటీవల భారీగా జుట్టు, గడ్డం పెంచిన ధోనీ.. ఇప్పుడు మరో సరికొత్త హెయిర్‌ స్టైల్‌లో తళుక్కుమన్నాడు.

సరికొత్త లుక్‌లో ధోనీ

సరికొత్త లుక్‌లో ధోనీ

సెలబ్రిటీల స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందిన ఆలిమ్‌ హక్కీమ్‌.. టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీని సరికొత్త లుక్‌లో కనిపించేలా చేశాడు. ప్రత్యేక హెయిర్‌ స్టైల్‌ చేసి న్యూలుక్‌లో మెరిసేలా ధోనీని తయారుచేశాడు. ఈ లుక్‌ను 'ఫంకీ హెయిర్‌ స్టైల్‌'గా పిలుస్తారట. వెరైటీ క‌టింగ్‌, గ‌డ్డంతో ధోనీ సూప‌ర్ లుక్‌తో అద‌ర‌గొడుతున్నాడు. ఈ లుక్‌ కుర్రకారును తెగ ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలను ఆలిమ్‌ హకీమ్‌ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఆ ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

వేరే లెవ‌ల్ హీరో

వేరే లెవ‌ల్ హీరో

ఎంఎస్ ధోనీ సరికొత్త లుక్‌పై సోష‌ల్ మీడియాలో లైక్‌లు, షేర్లు కుప్ప‌ల్లా వ‌చ్చిప‌డుతున్నాయి. ఫంకీ హెయిర్‌ స్ట‌యిల్‌తో మహీ దిగిన ఫోటో ఫ్యాన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి ధోనీ ఫోటోకు ఓ ఎమోజీతో కామెంట్ చేశాడు. 'ఎంఎస్ ధోనీ 25 ఏళ్ల కుర్రాడిలా క‌నిపిస్తున్నాడు' అని ఓ అభిమాని కామెంట్ పెట్టాడు.

'వేరే లెవ‌ల్ హీరో' అంటూ ఫాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ స్ట‌యిల్‌తో అభిమానులు కనిపించడం ఖాయం. ఐపీఎల్‌లో చెన్నై టీమ్‌తో ఆడుతున్న ధోనీ.. గ‌త ఏడాది ఆగ‌స్టులో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విష‌యం తెలిసిందే.

Tokyo Olympics 2021: ప్రేక్ష‌కులు లేరని.. ఒలింపిక్స్‌లో తళుక్కుమన్న ప్ర‌త్యేక అతిథి! 15 సెకన్ల పాటు!

నెరిసిన గడ్డంతో మహీ

ఎంఎస్ ధోనీ ఇటీవల హిమాచల్ ప్రదేశ్ టూర్‌ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబం, సన్నిహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లాడు. అనంతరం రాంచీలో తన స్నేహితులను కలిసి కార్ గారేజ్‌లో భోజనం చేస్తూ సరదాగా గడిపాడు. గారేజ్‌లో ఉండే బల్లపైనే భోజనం పెట్టుకుని మాట్లాడుకుంటూ తిన్నాడు. సాధారణ వ్యక్తిలా ధోనీ భోజనం చేసిన విధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆ సమయంలో నెరిసిన గడ్డంతో మహీ ఉన్నాడు. ఇప్పుడు న్యూలుక్‌లో అదరగొడుతున్నాడు.

ఆగస్టు మూడవ వారంతో యూఏఈకి

ఆగస్టు మూడవ వారంతో యూఏఈకి

ఇక ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ నెలలో యూఏఈలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే జరిగిన మ్యాచ్‌లలో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐదు మ్యాచ్‌లలో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ టీమ్‌లు అన్నీ ఆగస్టు మూడవ వారంతో యూఏఈకి బయలుదేరనున్నాయని సమాచారం. యూఏఈ చేరుకున్న తరువాత టీమ్‌ల సభ్యులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. ఆ తరువాత అందరికి కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తారు. నెగిటివ్ వస్తే బుడగలోకి అనుమతిస్తారు. ఆపై మ్యాచ్‌లో ఆడేందుకు కొనసాగిస్తారు.

Story first published: Friday, July 30, 2021, 18:13 [IST]
Other articles published on Jul 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+